Bigg Boss 7 Telugu: ఉల్టా పల్టా ట్విస్ట్

32
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 41 రోజులు పూర్తి చేసుకుంది. ఇక 6వ వారం వీకెండ్ కావడంతో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. 5 వారాల్లో ఎలిమినేట్ అయిన రతిక, దామిని, శుభశ్రీలను హౌస్‌లోకి రప్పించి సర్‌ప్రైజ్ ఇచ్చారు.

తొలుత హౌస్‌కి కొత్తగా కెప్టెన్ అయిన యావర్‌ పై ప్రశంసల జల్లు కురిపించారు.తర్వాత సర్‌‌ప్రైజ్ అంటూ టీవీ ఆపేసి…ఆ తర్వాత రతిక రోజ్, దామిని, శుభశ్రీలని పిలిచి సర్‌ప్రైజ్ ఇచ్చారు. మీ ముగ్గురిలో ఒకరు హౌస్‌మెట్‌గా లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది.. కానీ దానికి మీకు ఓటు వెయ్యమని హౌస్‌మెట్స్‌ని మీరు కన్విన్స్ చేయాలి అంటూ నాగార్జున చెప్పారు.

హౌస్ డోర్ ఓపెన్ కాగానే రతిక-దామిని- సుబ్బులను చూసి స్టన్ అయిపోయారు. అయితే వీళ్లను కలవకుండా ఉండేలా గార్డెన్ ఏరియా దగ్గరున్న డోర్ మాత్రం బిగ్‌బాస్ ఓపెన్ చేయలేదు. అక్కడి నుంచి హౌస్ మెట్లు అంతా వీళ్లను పలకరించేశారు. తర్వాత ఇంటి సభ్యులను తిరిగి టీవీ ముందుకు రావాలని కోరారు. హౌస్‌లో కనీసం మూడు వారాలు ఉండి.. ఎలిమినేట్ అయిన ముగ్గురు ఈరోజు వచ్చారు. ముగ్గురిలో ఒక్కరికి అవకాశం వస్తుంది.. కానీ అవకాశం ఇవ్వాల్సింది మీరు.. అంటూ నాగార్జున చెప్పారు. అయితే ఆ ఒక్కరు ఎప్పుడొస్తారు.. ఎలా వస్తారనేది.. బిగ్‌బాస్ డిసైడ్ చేస్తారని తెలిపారు.

Also Read:పాక్‌పై తిరుగులేని భారత్..

దీంతో ముందుగా దామిని మాట్లాడింది. నేను ఎలిమినేట్ అయిన రోజు నా ఆట నేను ఆడలేదని శివాజీ చెప్పారు.. అప్పుడు నేను నమ్మలేదు. కానీ ఇంటికెళ్లిన తర్వాత, బయట జనాలను చూసిన తర్వాత అర్థమైంది.. శివాజీ చెప్పిన మాట నిజమేనని తెలిపింది. ఈసారి అవకాశం వస్తే ఇంకా స్ట్రాంగ్‌గా మీ ముందుకు వస్తాను చెప్పుకొచ్చింది. తర్వాత రతిక …జాయితీగా ఉండి చేసిన తప్పులను సరిదిద్దుకోవాలనుకుంటే మరో అవకాశం వస్తుందని మా నాన్న చెప్పారు.. ఆ ఛాన్స్ మీరు ఇస్తారని నేను అనుకుంటున్నాను అని కోరింది. తర్వాత సుబ్బు తనకు ఓటేయాలని హౌస్‌మెట్స్‌ను కోరింది. నేను మీ లాయర్ పాప.. హౌస్‌లో ఉన్నంత సేపు చాలా ఎంటర్‌టైన్‌మెంట్ చేశాను. ఐదువారాలు ఇక్కడ ఉన్నాను.. నా ఫోకస్ కూడా ఎప్పుడూ గేమ్ మీదే ఉంది .. అవకాశం ఇస్తే నన్ను నేను ప్రూ చేసుకుంటాను చెప్పింది. ఓటింగ్ ప్రక్రియ ముగియగానే ముగ్గురు వెళ్లిపోయారు. ఆదివారం ఓటింగ్ జరగనుండగా ఎవరు హౌస్‌లోకి వస్తారోనన్నది తెలియనుంది.

Also Read:రేవంత్‌కు మరో షాక్..కీలక అనుచరుడు రాజీనామా!

- Advertisement -