బతుకమ్మ పాట పాడిన ఎమ్మెల్సీ కవిత..

48
- Advertisement -

బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి అని అర్థం. భాద్రపద అమావాస్య లేదా పితృ( పేతర) అమావాస్య నుండి ఆశ్వీయుజ శుద్ధ అష్టమి వరకు ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ ఇది. రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ, పాటలు పాడుతూ బతుకమ్మ ఆడతారు. ఇది తెలంగాణ రాష్ట్ర పండుగ.తొమ్మిది రోజులు సాగే ఈ వేడుకల్లో ప్రతీ రోజు బతుకమ్మను ఒక్కోపేరుతో పిలస్తూ, ఒక్కో రకమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు.

మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ఈ సంబురాలు ప్రారంభమవుతాయి. జాగృతి ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ పాటల ఆల్బమ్ ను కవిత ట్విటర్ ద్వారా షేర్ చేశారు. స్వయంగా పాట కూడా పాడారు కవిత. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -