పాక్ పై గెలవాలంటే..అలా చేయాల్సిందే!

27
- Advertisement -

వరల్డ్ కప్ లో జరిగే బిగ్గెస్ట్ క్లాష్ టీమిండియా వర్సస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ రేపు మద్యాహ్నం రెండు గంటలకు నరేంద్ర మోడి స్టేడియంలో జరగనుంది. ప్రస్తుతం ఇరు జట్లు కూడా రెండేసి మ్యాచ్ లు గెలిచి మంచి దూకుడు మీద ఉన్నాయి. దీంతో హ్యాట్రిక్ విజయం కోసం ఇటు టీమిండియా అటు పాకిస్తాన్ హ్యాట్రిక్ విజయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ప్రస్తుతం ఇరు జట్లు కూడా అత్యంత పటిష్టంగా ఉన్నాయి..

వరల్డ్ కప్ లో ఇప్పటివరకు వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై ఏడుసార్లు పై చేయి సాధించింది టీమిండియా. అయితే ఈసారి పాక్ ను ఓడించడం అంతా తేలికైన విషయం కాదు. ఎందుకంటే బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ ఆ జట్టు సమిష్టిగా రానిస్తోంది. కెప్టెన్ బాబర్, రిజ్వాన్. ఫఖర్ జమాన్, షాదబ్.. ఫుల్ ఫామ్ లో ఉన్నారు అటు బౌలింగ్ లో షాయిన్ అఫ్రిది, హారిస్ రఫ్, హాసన్ అలీ వంటివారితో టీమిండియాకు ముప్పు పొంచి ఉంది. వీరిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఇక టీమిండియా విషయానికొస్తే.. భారత్ కూడా అన్నీ విభాగాల్లో అత్యంత పటిష్టంగా ఉంది.

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో నిరాశపరిచిన కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆఫ్ఘాన్ తో జరిగిన మ్యాచ్ తో తిరిగి ఫామ్ లోకి వచ్చారు. ఇక అలాగే మొదటి రెండు మ్యాచ్ లకు డెంగీ జ్వరం కరణంగా దూరమైన శుబ్ మన్ గిల్.. పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో తిరిగి అడుగుపెట్టనున్నారు. గిల్ ఎంట్రీ తో భారత్ బ్యాటింగ్ దళం మరింత పటిష్టంగా మారింది. ఇక విరాట్ కోహ్లీ, కే‌ఎల్ రాహుల్, హర్ధిక్ పాండ్య, ఇషన్ కిషన్ వంటి వారు స్థాయికితగ్గ ప్రదశన చేస్తే జట్టుకు తిరుగుండదు. ఇక బౌలింగ్ విషయానికొస్తే బుమ్రా, సిరాజ్, షమి వంటివారు ప్రధాన బలం. కాబట్టి పాక్ పై గెలవాలంటే బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ సమిష్టిగా రాణిస్తే విజయావకాశాలు ఎక్కువ అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read:గంధంతో.. అందం

- Advertisement -