హీరో రవితేజ రేంజ్ 27 కోట్లు!

31
- Advertisement -

నటనలో, ఫాలోయింగ్ లోనే కాదు, తాను సంపాదనలోనూ మాస్ మహారాజానే అంటున్నాడు రవితేజ. ప్రస్తుతం రవితేజ 25 కోట్లు దాటేశాడు. రెమ్యునరేషన్ విషయంలో చకచకా మెట్లు ఎక్కుతున్న హీరోల్లో రవితేజ ముందు నుంచి ముందు వరుసలోనే నిలుస్తున్నాడు. వాస్తవానికి రెండు మూడేళ్ల క్రితం.. క్రాక్ సినిమా ముందు వరకూ తొమ్మిది కోట్ల రేంజ్ లో వున్న రవితేజ రెమ్యూనరేషన్ ఇప్పుడు పాతిక కోట్లు దాటేసినట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. రవితేజ చాలా వెల్ ప్లాన్డ్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. పైగా ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చే నిర్మాతలకే మొదటగా డేట్లు ఇస్తున్నాడు.

అందుకే, రవితేజ రెమ్యునరేషన్ కూడా సినిమా సినిమాకు చాలా వేగంగా పెరుగుతోంది. లేటెస్ట్ గా 27 కోట్లు దాటినట్లు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. రవితేజ ప్రస్తుతం చేస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాకు 23 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్నారని టాక్ వుంది. రవితేజ ఓకె చేసి లైన్ లో వుంచిన సినిమాకు నిర్మాత ఠాగూర్ మధు 27 కోట్లు ఆఫర్ చేసారని వార్తలు వినిపిస్తున్నాయి. దానికన్నా ముందుగా రవితేజ, నిర్మాత డివివి దానయ్య సినిమా చేయాల్సి వుంది. దానయ్య ఎలాగూ అడిగినంత ఇవ్వడానికి ఏ మాత్రం ఆలోచించడు. సో.. ఏ రకంగా చూసుకున్నా రవితేజ ఇక నుంచి 27 కోట్లు పైనే తీసుకుంటాడు.

కాకపోతే, రవితేజ ప్రస్తుతం చేస్తున్న ఈగల్ సినిమాకు మాత్రం కేవలం 17 కోట్లు మాత్రమే పుచ్చుకున్నాడు. ఈ సినిమా ఒప్పుకుని రెండేళ్లు అవుతుంది. అప్పటి రెమ్యునరేషన్ కి తగ్గట్టు.. ఈగల్ సినిమాకి రవితేజ సైన్ చేశాడు. అందుకే, ఈ సినిమాకి తక్కువ తీసుకుంటున్నాడు. ఇక నుంచి ఒప్పుకునే సినిమాలకు మాత్రం 27 కోట్ల రేంజ్ లోనే రెమ్యునరేషన్ వుండొచ్చు. వీలయినంత వరకు కొత్త దర్శకులు లేదా తనకు నచ్చిన దర్శకులతో మాత్రమే రవితేజ సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అందుకే, డేట్లు విషయంలోనూ తనకు నచ్చినప్పుడే సినిమా స్టార్ట్ అవుతుంది.

Also Read:షర్మిల.. బ్యాక్ టూ ఆంధ్రా?

- Advertisement -