వేముల ప్రశాంత్ తల్లి మృతి…సీఎం కేసీఆర్ సంతాపం

75
- Advertisement -

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ అనారోగ్యంతో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లో రేపు ఉదయం అంత్యక్రియలు జరుగనున్నాయి. మంజులమ్మ మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం ప్రకటించారు. వేముల మంజులమ్మ మృతి పట్ల సంతాపం తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి.ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని,వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు.

Also Read:టీడీపీ, బీజేపీ అంతర్గత పొత్తు?

- Advertisement -