అంబాజీపేట మ్యారేజి బ్యాండు…టీజర్

28
- Advertisement -

సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్న”అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా త్వరలో థియేటర్స్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా టీజర్ ను సోమవారం హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో టాలెంటెడ్ డైరెక్టర్స్ మారుతి, హను రాఘవపూడి, శైలేష్ కొలను, సాయి రాజేశ్, సందీప్ రాజ్, ప్రశాంత్, మెహర్, భరత్ కమ్మ నిర్మాత ఎస్కేఎన్, ఛాయ్ బిస్కట్ శరత్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

యాక్ట్రెస్ శరణ్య ప్రదీప్ మాట్లాడుతూ – “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” టీజర్ చూడగానే ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోయా. ఈ సినిమా కోసం కష్టపడి వర్క్ చేశాం. మూవీ చేస్తున్న క్రమంలో యూనిట్ అంతా ఒక ఫ్యామిలీలాగ అయిపోయాం. నాకు ఈ మూవీలో క్యారెక్టర్ ఇచ్చి, నేను చేయగలను అని బిలీవ్ చేసిన దర్శకుడు దుశ్యంత్ కు థ్యాంక్స్ చెబుతున్నా. టెక్నికల్ గా అన్ని క్రాఫ్ట్ లలో సినిమా ఆకట్టుకుంటుంది. మూవీ మీ అందరికీ నచ్చేలా బాగుంటుంది. అన్నారు.

యాక్టర్ జగదీశ్ మాట్లాడుతూ – సుహాస్ అన్న యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నటించిన మజిలీ సినిమా చూసినప్పుడు నటుడిగా ఒక ఇన్సిపిరేషన్ కలిగింది. మనకూ అవకాశాలు వస్తాయని నమ్మాను. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” లో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ కు థ్యాంక్స్. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. అన్నారు.

యాక్టర్ నితిన్ మాట్లాడుతూ – “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాలో మేమంతా ఒక ఫ్యామిలీలా కలిసి పనిచేశాం. నా కెరీర్ లో ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కు దుశ్యంత్ కు థ్యాంక్స్. మల్లీ నాకు ఇలాంటి అవకాశం వస్తుందో లేదో తెలియదు. మీకు ఈ సినిమాలో ఏ ఆర్టిస్ట్ కనిపించరు. కేవలం ఆ క్యారెక్టర్స్ మాత్రమే కనిపిస్తాయి. అంతలా ప్రతి ఒక్కరూ కథలో కలిసిపోయినట్లు నటించారు. అన్నారు.

Also Read:సమంత పోస్ట్ మళ్లీ వైరల్

- Advertisement -