ప్చ్.. మారాల్సింది స్టార్ హీరోలే

27
- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలంతా ఇప్పుడు హీరోల పై పడి తమ బతుకులను లాకెళ్తున్నారని ఓ టాక్. ఇందులో నిజానిజాల సంగతి పక్కన పెడితే.. నేటి సినిమాల మార్కెట్ చాలా విచిత్రంగా తయారు అయింది. స్టార్ హీరో అయితేనే ఆ సినిమాకి మోక్షం. లేదు అంటే.. పోస్టర్ల డబ్బులు కూడా రావు. అందుకే, హీరోలదే ఇప్పుడు పెత్తనం. వాళ్ళు ఏది చెబితే.. అదే ఫైనల్. ఇలాంటి పరిస్థితుల్లో తమిళ సినీ నిర్మాతలంతా ఒక్కటి అయ్యారు. హీరోల పైత్యానికి ఎదురు తిరిగారు. తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి హీరోల పై చర్యలు కూడా తీసుకుంది. కానీ ఆ చర్యలు పూర్తి స్థాయిలో ఆచరణలోకి రాకపోవడం ఇక్కడ గమనార్హం.

అదేంటి ?, అంటే.. అది అదే. కోలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా, శాండల్ వుడ్ అయినా, మాలీవుడ్… ఇలా ఏ వుడ్డయినా సరే.. ప్రస్తుతం హీరోస్వామ్యమే నడుస్తోంది. కాబట్టి.. వారి పై చర్యలు ఉండవు. అందుకేనేమో.. తెలుగు నిర్మాతలకు అంత దమ్మున్నా.. తమిళ నిర్మాతలు లాగా తోక ఆడించలేదు. హీరోల పాదాల మీద పడి దేకడమే తప్ప ఇప్పుడు నిర్మాతలకు ఇంకో ఆప్షన్ లేదు. గుంటూరు కారం సినిమా విషయానికే వద్దాం. ఆ సినిమాకి స్టార్ దర్శకుడు త్రివిక్రమ్, అన్ని తానై నడిపిస్తున్నాడు. కానీ, వాస్తవానికి మహేష్ బాబు ఓకే అంటేనే.. త్రివిక్రమ్ మాట కూడా చెల్లుబాటు కానీ పరిస్థితి ఉంది.

Also Read:సమంత పోస్ట్ మళ్లీ వైరల్

ఒక్క రాజమౌళికి తప్ప.. మిగిలిన ఏ స్టార్ దర్శకులకు కూడా హీరోల మీద నియంత్రణ లేదు. హీరోలు చెప్పినట్టే కథ, చెప్పినవాళ్లే ఆర్టిస్టులు… చివరకు చెల్లెలి పాత్రలు, ఎక్సట్రా ఆర్టిస్టులు కూడా స్టార్లు చెప్పినట్టే ఉండాలి. ఇక మ్యూజిక్, డాన్స్ మాస్టర్ల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిఖిల్ అనే చిన్న హీరో మొన్న ఓ ఫైట్ మాస్టర్ ను సెట్ లో నుంచి తీసి పారేశాడు. నిర్మాతతో మాట మాత్రం కూడా చెప్పకుండానే అతగాడు.. ఓ ఫైట్ మాస్టర్ ను ఎలా తీసేస్తాడు ?, నిర్మాత అడ్వాన్స్ ఇచ్చి ఉంటాడు కదా. అదంతా నిర్మాత బాధ. హీరోకి పోయేది ఏముంది ?, ఇది నేటి సినిమా పరిస్థితి, స్థితి. కాబట్టి.. ఇప్పుడు మారాల్సింది నిర్మాతలు కాదు, హీరోలు.

- Advertisement -