తెలంగాణలో ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. 50 రోజుల టార్గెట్ తో ప్రధాన పార్టీలు ఎన్నికల కురుక్షేత్రం లోకి దిగిపోయాయి. అయితే, గత ఎంపీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చిన స్థానాల్లో కీలకమైన నిజామాబాద్ లో ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయి అనే ఉత్కంఠ మొదలైంది. అన్ని సర్వేల్లోనూ అధికార బిఆరెస్ కు స్పష్టమైన మెజారిటీ కనిపిస్తుండగా… తాజాగా కాంగ్రెస్ పార్టీ కీలక నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన మరో సర్వే బయటకు వచ్చింది.
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో గల అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ లలో బిఆరెస్, బీజేపీ పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ కు ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది… ఎన్ని సీట్లు వస్తాయి, ఏ నాయకుల ప్రభావం ఎంత అన్న అంశాలపై క్షుణ్ణంగా సర్వే నిర్వహించారు. అన్ని ఎంపీ సెగ్మెంట్స్ లో ఈ సర్వే చేసినప్పటికీ, ఎంపీ అరవింద్ పసుపు బోర్డ్ నేనే తెచ్చా అని ఊరూరా భారీగా ఖర్చు చేసి ప్రచారం చేసుకున్న నేపథ్యంలో నిజామాబాద్ సర్వే పై ఆసక్తి నెలకొంది.
ఈ సర్వే ప్రకారం… పసుపు బోర్డ్ ను కేవలం ఎన్నికల కోసమే తెర పైకి తెచ్చారని, ఎంపీ అరవింద్ ను నమ్మలేమని జనం తేల్చేశారు. అంతేకాదు ఈ సారి నిజామాబాద్ లో బిఆరెస్ పార్టీ దే ఘానా విజయమని, ఎమ్మెల్సీ కవిత ఓడినా గెలిచినా నిజామాబాద్ జనంకు అందుబాటులో ఉన్నారని, కేసీఆర్ పథకాలు అదనపు బలమని సర్వే లో వెల్లడైంది. డీకే సర్వే ప్రకారం…. నిజామాబాద్ లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బిఆరెస్ పూర్తి లీడింగ్ లో ఉండగా, అనూహ్యంగా కాంగ్రెస్ సెకండ్ పొజిషన్ లోకి దూసుకొచ్చింది. బీజేపీ ఏకంగా మూడో స్థానానికి పరిమితం అయిందని తేలింది. అందుకే మొన్నటి వరకు అర్మూర్ లో పోటీ చేస్తా అన్న ఎంపీ అరవింద్… ఇప్పుడు ఓసారి కోరుట్ల, మరోసారి ఎన్నికల్లో పోటీ చేయనంటూ కొత్త పాట పాడుతున్నారు.
Also Read:పిక్ టాక్ : బిగువైన పరువాలతో మైమరిపిస్తోంది
నిజానికి ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ జిల్లా అభివృద్ధి విషయంలో, నిధుల విషయంలో, ప్రజలు-క్యాడర్ విషయంలో తీసుకున్న చొరవ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పాజిటివ్ గా మారాయి. రాబోయే ఎంపీ ఎన్నికల్లోనూ కవిత విజయం నల్లేరు పై నడకే అన్నది సర్వేల మాట.దింతో గత ఎన్నికల్లో కవితను ఓడించేందుకు ఏకమైన బీజేపీ-కాంగ్రెస్… తాజా సర్వేల తర్వాత ఇప్పుడు మళ్లీ అలాంటి కుట్రలకే తెర తీస్తున్నాయి. ఎలాగైనా కవిత హవా తగ్గించాలన్న ఉద్దేశ్యంతో కలిసి పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read:ఓ.. ప్రగ్యా జైస్వాల్ కి ఛాన్సొచ్చింది