ప్లాపైనా కోటిన్నర మిగిలింది..

239
Adult comedy 'Babu Baga Busy' fails
- Advertisement -

యాక్టర్ కామ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ కు ఇప్పటిదాకా టాలీవుడ్లో క్లీన్ ఇమేజ్ ఉంది. నటుడిగానే కాక తన స్వీయ దర్శకత్వంలో చేసిన సినిమాతోనూ క్లీన్ ఇమేజ్ సంపాదించుకున్నాడతను. అలాంటి వాడు.. బాలీవుడ్ అడల్ట్ కామెడీ ‘హంటర్’ రీమేక్ లో హీరోగా నటించడం.. అందులో సెక్స్ అడిక్ట్ క్యారెక్టర్ చేయడం.. హాట్ హాట్ సన్నివేశాలు చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అవసరాల ఇలాంటి పాత్ర ఎలా ఒప్పుకున్నాడో అన్న సందేహాలు రేకెత్తాయి.

ఇలాంటి సినిమా అవసరాలకి అవసరమా? అంటూ కామెంట్లు వచ్చినా… దర్శకుడిగా మంచి ఇమేజ్‌ తెచ్చుకున్న అవసరాల ఈ టైమ్‌లో ఎందుకు కక్కుర్తి పడి ఇలాంటి చీప్‌ సినిమా చేసాడంటూ విమర్శలు వెల్లువెత్తిన పట్టించుకోలేదు అవసరాల. సెన్సార్ అవసరాలను సైతం పక్కన బెట్టి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బాబు బాగా బిజీ’ బాక్సాఫీస్‌ ఫలితం శ్రీనివాస్‌ అవసరాలకి చేదు అనుభవాన్ని మిగిల్చింది.

Adult comedy 'Babu Baga Busy' fails
అయితే అవసరాల మాత్రం దీనిని ఏమాత్రం లెక్కచేయలేదట. ఎందుకంటే దర్శకుడిగా ఒక సినిమాకి ఏడాదికి పైగా సమయం తీసుకునే తనకి ‘బాబు బాగా బిజీ’ పూర్తి చేయడానికి నాలుగు నెలలు పట్టిందట. ఈ నాలుగు నెలలకి గాను అతను అందుకున్న పారితోషికం కోటిన్నర అట. సో సినిమా ప్లాపైన తనకు మాత్రం లాభమే చేకూరిందని అవసరాల భావిస్తున్నాడట.

అయితే నిర్మాతకు మాత్రం చేదు అనుభవమే మిగిలింది. బాక్సాఫీస్‌ వద్ద కోట్లు కుమ్మరించే సెక్స్‌ కామెడీ అవుతుందని ఆశించిన నిర్మాతకి నాలుగో రోజుకే సినిమా తీసేసి పాత చిత్రాలు ప్రదర్శించాల్సిన స్థాయి రావడంతో ఇబ్బందుల్లో పడ్డాడట.

- Advertisement -