5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రిలీజైంది. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఛత్తీస్ గడ్‌లో నవంబర్ 7 , 17న ఎన్నికల పోలింగ్ జరగనుందని వెల్లడించారు.
తెలంగాణ మొత్తం ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా నవంబర్ 10 నుండి నామినేషన్లను స్వీకరించనున్నారు. 13న నామినేషన్ల స్క్రూటినీ ఉండనుండగా నామినేషన్ ఉపసంహరణకు నవంబర్ 15 చివరి తేదీ. ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ 5తో ముగియనుంది.
5 రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ స్ధానాలకు ఎన్నికలు జరగనుండగా 16.5 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు రాజీవ్ కుమార్. ఆ ఐదు రాష్ట్రాల్లో మహిళా, యూత్ ఓటర్లు కీలకం కానున్నారని.. తెలంగాణలో 119 ,ఎంపీ 230,రాజస్ధాన్ 200,ఛత్తీస్ గఢ్ 90, మిజోరం 40 స్ధానాలకు ఎన్నికలు జరగనున్నట్లు చెప్పారు. ఎన్నికల కోసం 6 నెలలుగా కసరత్తు చేస్తున్నామన్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లో 60.2 లక్షల ఓటర్లు కొత్తగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారని చెప్పారు. ఎన్నికల నిర్వహణపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చించామని తెలిపారు.
Also Read:5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్..