బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, ఆయన అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి మంత్రి కేటీఆర్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా కంఠారెడ్డి తిరుపతి రెడ్డి గారు మాట్లాడుతూ…గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని మెదక్ జిల్లాలో బలోపేతం చేసేందుకు శాయశక్తుల కృషి చేశాను అని తెలిపారు.
టికెట్ ఇస్తామని చెప్పి పార్టీ మోసం చేసిందని…ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలతో మమేకమైన నాయకులకు కాకుండా డబ్బు సంచులతో వచ్చిన పారాషూట్ లీడర్లకి మాత్రమే టికెట్లు ఇస్తుందన్నారు. డబ్బు సంచులతో వచ్చిన వాళ్లకు టికెట్లను అమ్ముకుంటున్నారు..అందుకే ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పని చేసేందుకు ఈరోజు భారత రాష్ట్ర సమితిలో చేరామన్నారు.
మెదక్ జిల్లాలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నారని..మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం అన్నారు. ఇంటి ఇంటికి గడపగడపకు తిరిగి ఉమ్మడి మెదక్ జిల్లాలోని అత్యధిక మెజార్టీతో మెదక్ నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగరవేస్తాం అని… కాంగ్రెస్ పార్టీ నుంచి భారత రాష్ట్ర సమితిలోకి తన క్యాడర్ తో పాటు వస్తున్న తిరుపతి రెడ్డి హృదయపూర్వక స్వాగతం అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన తిరుపతిరెడ్డి లాంటి నాయకులను బలవంతంగా బయటకి పంపించిందని…కానీ భారత రాష్ట్ర సమితిని బలోపేతం చేసేందుకు ముందుకు వచ్చి పార్టీలో జాయిన్ అవడం స్వాగతించదగిన విషయం అన్నారు. తిరుపతి రెడ్డితో పాటు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని పార్టీ కాపాడుకుంటుందని..వారికి సముచిత గౌరవాన్ని అందిస్తుంది అని మంత్రి కేటీఆర్ అన్నారు.
Also Read:World Cup 2023 :కివీస్ బోణి.. కప్పు ఆ జట్టుదేనా?