ఎన్నికల నగార మోగే టైమొచ్చింది?

31
- Advertisement -

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనుండడంతో ప్రధాన పార్టీలన్నీ ఎలక్షన్ వార్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కాగా నిన్న మొన్నటి వరకు ఎన్నికల విషయంలో సస్పెన్స్ కొనసాగిన సంగతి తెలిసిందే. ఎన్నికల విషయంలో కేంద్రం వేరే ప్రణాళికలు వేస్తోందని, ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుత ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు కనిపించడం లేదు. ఈ ఏడాది చివర్లో తెలంగాణతో పాటు మరో ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్, మిజోరాం, మద్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ తెలంగాణలోఎలక్షన్ పనులను కూడా మొదలు పెట్టింది. ఈ నెల 8-10 తేదీల మద్యలో ఎలక్షన్ షెడ్యూల్  ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి..

దాంతో ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే 119 స్థానాలకు గాను 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఇక కాంగ్రెస్, బిజెపి పార్టీలు అభ్యర్థుల విషయంలో మదన పడుతూనే ఉన్నాయి. ఈ పార్టీలు మాత్రమే కాకుండా ఈసారి ఎన్నికల్లో జనసేన కూడా పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల స్పష్టం చేశారు. ఆల్రెడీ టిడిపి ఎలాగూ పోటీలో ఉంది. ఇక సిపిఎం, సిపిఐ పార్టీలు పొత్తుల కోసం కొత్త ఎత్తులు వేస్తున్నాయి. దీంతో ఎన్నికల సమయానికి ఏ ఏ పార్టీలు కలిసి బరిలోకి దిగుతాయి. అసలు పార్టీల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇకపోతే ఈ నెల 16న అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించనుంది. ప్రజాశ్రేయస్సు కోసం అధినేత కే‌సి‌ఆర్ మేనిఫెస్టోను పకడ్బందీగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికల నగార మోగడం ఖాయంగా కనిపిస్తోంది.

- Advertisement -