బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 33వ ఎపిసోడ్ పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ హౌస్‌లో యావర్ తెలుగు కాకుండా ఇంగ్లీష్, హిందీలో మాట్లాడుతున్నారని.. అందుకు అతనికి తెలుగు క్లాస్ పెట్టిస్తున్న బిగ్ బాస్ నుంచి అనౌన్స్‌మెంట్ వచ్చింది. దీంతో ఇంటి సభ్యులంతా టీచర్లుగా మారి యావర్‌కి తెలుగు నేర్పించాలని ఆదేశించారు. దీనికి అమర్‌ని సంచాలకునిగా నియమించారు.
టేస్టీ తేజాతో ఆటాడు కున్నాడు యావర్. నడ్డి విరుగుద్ది అని టేస్టీ తేజా బోర్డుపై రాయడంతో.. యావర్ నిజంగానే తన్ని తేజా నడ్డి విరగ్గొట్టినంత పని చేశాడు. ఇక శుభశ్రీ తెలుగు రాక.. నానా బూతులు మాట్లాడుంటే.. యావర్‌కి తెలుగు నేర్పించమని ఆమెకు చెప్పాడు. తర్వాత శోభాశెట్టి వచ్చి.. భార్య, భర్త, మరదలు,మామ అంటూ వరసలు నేర్పించింది.
అమర్ వచ్చి లైట్‌ని వెలుగు అంటారు.. వెలుగూ అని చెప్పాడు. ఈ టాస్క్‌లో ప్రిన్స్ యావర్ పెర్ఫామెన్స్‌తో ఇరగదీశాడు. కెప్టెన్సీ రేస్‌లో భాగంగా బడ్డీ ప్లేయర్స్‌లో తక్కువ స్టార్స్ ఉన్న జంటను రేస్ నుంచి తప్పించాలని చెప్పారు బిగ్ బాస్. దీంతో చివరి స్ధానంలో ఉన్న ప్రియాంక, శోభాశెట్టిలను టాస్క్ నుంచి తప్పించారు బిగ్ బాస్.
హౌస్‌లోకి వెళ్లింది మొదలు.. కాఫీ కోసం శివాజీ కొట్లాడుతూనే ఉన్నాడు. ఛీ దీనమ్మా జీవితం.. కాఫీ ఇవ్వని బతుకు నాదీ ఓ బతుకేనా? కాఫీ ఇవ్వకపోతే హౌస్ నుంచి వెళ్లిపోతా అని ఇంతకు ముందు చాలాసార్లు బెదిరించిన శివాజీ ..తాజాగా బిగ్ బాస్‌ని బండైబూతులు తిట్టాడు.
Also Read:ఆ కేసుతో సంబంధం లేదు:వరలక్ష్మి