కాంగ్రెస్ కు బిగ్ షాక్..రేవంత్ రెడ్డి జైలుకే?

29
- Advertisement -

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జైలు కు వెళ్ళడం ఖాయమేనా అంటే అవుననే సమాధానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. గతంలో ఆయన టీడీపీలో ఉన్నప్పుడూ ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. డబ్బు పంచుతు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన సంగతి విధితమే. అప్పటి నుంచి కూడా ఆ కేసు అడపా దడపా తెరపైకి వస్తూనే ఉంది. ఇక తాజాగా గతంలో ఓటు కు నోటు కేసులో విచారణ జరపాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి 2017లో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ అప్పటి నుంచి హోల్డ్ లో ఉంటూ వచ్చింది. .

ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కామ్ ల అంశం ఏపీలో సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో 2015లో చంద్రబాబు ద్వారా జరిగిన ఓటుకు నోటు అంశాన్ని పునః పరిశీలించాలని ఆళ్ళ రామకృష్ణరెడ్డి మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇప్పటికే పలు స్కామ్ ల విషయంలో రిమాండ్ ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడికి ఓటుకు నోటు కేసు కూడా మళ్ళీ తెరపైకి వస్తే మరింత తలనొప్పిగా మారే అవకాశం ఉంది.

అయితే ఈ కేసులో ప్రధానంగా రేవంత్ రెడ్డి పాత్రదారి కావడం.. ఎటొచ్చీ ఈ కేసు రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసు విషయంలో రేవంత్ రెడ్డి జైలు శిక్ష కూడా అనుభవించారు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న ఆయనకు మళ్ళీ ఈ కేసు హియరింగ్ కు రావడంతో ఉలిక్కిపడ్డారు. అటు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి నాయకత్వంపై ఎప్పటి నుంచో గుర్రుగా ఉన్న ఇతర నేతలు.. రేవంత్ రెడ్డిని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని అధిష్టానం ముందు విన్నవించుకునేందుకు రెడీ అవుతున్నారట. ఎందుకంటే ఎన్నికల ముందు ఓటుకు నోటు కేసు అంశం హాట్ టాపిక్ అయితే రేవంత్ రెడ్డి మళ్ళీ జైలు బాటా పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే రేవంత్ రెడ్డిని వీలైనంతా త్వరగా అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఇతర నాయకులు అధిష్టానంతో చర్చించేందుకు సిద్దమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:రజనీతో అమితాబ్ – కమల్!

- Advertisement -