Vinod Kumar:కేసీఆర్ అంటేనే మోడీకి భయం

37
- Advertisement -

నిజామాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్. కోవిడ్ తరువాత మోడీ హైదరాబాద్ వచ్చారు… అప్పుడు కేసీఆర్ ను మోడీనే వద్దు అన్నారు.. కేసీఆర్ అంటే మోడీ కి భయం అన్నారు.

GHMC ఎన్నికలకు మోడీ పర్యటనకు ఎం సంబంధం అన్నారు. కేసీఆర్ గురించి మోడీ ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. మోడీ జుమ్లా మాటలు అనేది ఇప్పుడు నిరూపితం అయ్యాయని తెలిపారు. మోడీ అంటే తెలంగాణ, తమిళ్ నాడు, కేరళ అంటే కూడా ఇష్టం లేదు అన్నారు. కేసీఆర్ మోడీ వద్దకు వచ్చి చూస్తానంటే ఎందుకు వద్దాన్నారు అని ప్రశ్నించారు.

Also Read:‘సల్మాన్ – ప్రభాస్’ లతో ఎన్టీఆర్

కారు గుర్తును పోలిన గుర్తులు ఎవరికి కేటాయించవద్దని ఈసీని కోరారు వినోద్ కుమార్. సోషల్ మీడియాలో వ్యక్తుల పై అసభ్యకరమైన ఆరోపణలు చేస్తున్నారని…రాజకీయపరమైన విమర్శలు ఒకే… కానీ వ్యక్తిగత విమర్శలు అపాలని కోరామన్నారు. ఓటర్లలో విడిజన్ తెచ్చే ప్రయత్నం కొందరు చేస్తున్నారనే విషయాన్ని EC దృష్టికి తీసుకెళ్ళామని చెప్పారు. ఎన్నికల ఖర్చు అనేది ఒకే రేటు పెట్టాలని సూచించామని..పాత ఎన్నికల ఖర్చు 20లక్షలు పెంచాలని కోరామన్నారు.

ఎన్నికల నియమ నిబంధనలు తెలుగులో పెట్టాలని EC ని కోరామన్నారు. ఫ్రీ అండ్ ఫెర్ ఎన్నికలకు బిఆరెస్ సహకరిస్తుందని ECకి తెలిపామన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు పూర్తి పవర్ ఇవ్వాలని కోరామని… రాజకీయాల్లో ఓడిపోయే పార్టీలు అనేక విమర్శలు చేస్తాయన్నారు.

Also Read:‘సల్మాన్ – ప్రభాస్’ లతో ఎన్టీఆర్

- Advertisement -