ట్రైలర్ టాక్ : ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’ కుమ్మేశాడు

22
- Advertisement -

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న పాన్ ఇండియా సినిమా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు. వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ట్రైల‌ర్ కాసేప‌టి కింద‌టే రిలీజైంది. 2.31 నిమిషాల నిడివి క‌లిగిన ఈ ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకునేలా ఉంది. ఇలాంటి పిరియాడిక్ మూవీ ట్రైలర్ ను కట్ చేయడం కత్తిమీద సాము లాంటిది. కానీ, ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’ ట్రైలర్ లో అటు ఎమోషన్స్ ను, ఇటు యాక్షన్ ను సమపాళ్లలో బ్యాలెన్స్ చేస్తూ చేసిన షాట్ మేకింగ్ అద్భుతంగా ఉంది. రవితేజ లో.. యాక్షన్ హీరోను కళ్లకు కట్టినట్టుగా చూపించడంలో దర్శకుడు వంశీ హండ్రెడ్డ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు.

మామూలుగా దొంగ తనం నేపథ్యంలో సినిమా అంటే.. అందులో బూతు డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలుస్తాయి. ఈ ట్రైలర్ లో ఎమోషన్ కూడా హైలైట్ అవ్వడం విశేషం. కాకపోతే, రవితేజ సినిమా అంటే ఎంటర్ టైన్మెంట్ పక్కా అని నమ్మకం. ఈ ట్రైలర్ లో మాత్రం అదేమీ లేకుండానే ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’ ట్రైలర్ ను కట్ చేశారు. పైగా యాక్షన్ సినిమాలో ఎమోషన్స్ ను హైలైట్ చేశారు. మొత్తానికి ఓ అద్భుతమైన సినిమాను చూడబోతున్నాం అనే ఫీలింగ్ కలిగించేలా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’ ట్రైలర్ ను తీసుకువచ్చారు.

ఓ రకంగా రవితేజ పై భారీ యాక్షన్ డ్రామాను రన్ చేయడం ఆషామాషీ విషయం కాదు. చూస్తుంటే ర‌వితేజ ఈసారి ద‌స‌రాకు పెద్ద హిట్ కొట్టేట్లున్నాడు. టైగ‌ర్ నాగేశ్వ‌రరావు సినిమా అక్టోబ‌ర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మరి ఏ రేంజ్ లో కలెక్షన్ల సునామీని క్రియేట్ చేస్తోందో చూడాలి.

Also Read:సర్వేల రిపోర్ట్..బి‌ఆర్‌ఎస్ దే విజయం!

- Advertisement -