ఆలివ్ పండు తింటే ఆ సమస్యలన్నీ దూరం!

31
- Advertisement -

సాధారణంగా ఆలివ్ ఆయిల్ గురించి అందరికీ తెలిసే ఉంటది. వంటల్లో అత్యంతా విరివిగా వాడే వంటనూనెలలో ఇది ఒకటి. సాధారణంగా ఆలివ్ ఆయిల్ లో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అంతేకాకుండా సౌందర్యాన్ని పెంచే లక్షణాలు కూడా ఆలివ్ మొక్కలోనూ ఆలివ్ ఆయిల్ లోనూ ఉన్నాయి. అయితే ఆలివ్ ఆయిల్ తెలిసినట్లుగా ఆలివ్ పండు గురించి చాలమందికి తెలియదు. వీటి ద్వారానే ఆలివ్ ఆయిల్ ను తయారు చేస్తారు. ఈ ఆలివ్ పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆలివ్ పండులో విటమిన్ ఇ, ఐరన్, కాపర్, కాల్షియంతో పాటు మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. .

కాబట్టి ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆలివ్ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పనితీరును మెరుగు పరుస్తాయట. తద్వారా మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు దురమౌతాయి. ఇంకా ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను బయటకు పంపించడంలో ఉపయోగ పడతాయట. నేటి రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అలా గుండె జబ్బులు ఉన్నవారు ఆలివ్ పండు తింటే ఎంతో మంచిదట. ఇందులో మోనో ఆన్ షాచూరేటెడ్ ఫ్యాటి యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని ఫదిలంగా ఉంచడంలో తోడ్పడతాయి. ఇంకా ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు క్యాన్సర్ నివారిణిగా కూడా పని చేస్తాయట. స్త్రీలలో వచ్చే రొమ్ము క్యాన్సర్, పెద్ద ప్రేగు క్యాన్సర్ వంటి వాటిని దూరం చేయడంలో సహాయపడతాయట. ఇంకా అలీఫ్ పండ్లను తినడం వల్ల రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read:అశ్విన్ ను తీసుకోవడం కరెక్టేనా?

- Advertisement -