చేపనూనె వాడితే ప్రమాదమా?

45
- Advertisement -

చేపనూనె సప్లిమెంట్స్ రూపంలో దొరుకుతుంది. ఇందులో ఒమేగా 3, ఫ్యాటి యాసిడ్స్ మరియు ఇతరత్రా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సాధారణంగా చేపనూనెను చేపల కణజాలం నుంచి తయారు చేస్తారు. ముఖ్యంగా సాల్మాన్ ఫిష్, వైట్ ఫిష్, హెర్రింగ్, సర్దినస్ వంటి చేపల నుంచి చేపనూనెను ఎక్కువగా తయారు చేస్తారు. చేపనూనెను ఆరోగ్య ప్రదాయినిగా పరిగణిస్తుంటారు నిపుణులు. అయితే చేపనూనె సప్లిమెంట్ తీసుకోవడం వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనే అపోహ చాలమందిలో ఉంది. అయితే ఎన్నో పరిశోధనల ద్వారా వెల్లడిందేమిటంటే.. చేపనూనె ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందట. .

ముఖ్యంగా గుండె సంబంధిత రోగాలను తగ్గించడంలో చేపనునే సమర్థవంతంగా పని చేస్తుందని కొన్ని పరిశోదనల్లో వెల్లడింది. చేపనూనె శరీరంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించి అధిక రక్తపోటు, గుండెపోటు వంటి వాటిని దూరం చేయడంలో దోహదపడుతుందట. ఇంకా కొందరిలో వయసు పైబడే కొద్ది దృష్టి లోపం పెరుగుతుంది. అలాంటివారికి చేపనూనె దివ్యఔషధంలా పని చేస్తుందట. ఇందులో ఉండే విటమిన్ ఏ మరియు ఒమేగా 3 కంటికి ఎంతో మేలని నిపుణులు చెబుతున్నారు.

Also Read:జూనియర్ ఆర్టిస్ట్‌గా మారిన ఆ హీరోయిన్!

ఇంకా రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి కరకాలను దూరం చేసే గుణాలు చేప నూనెలో పుష్కలంగా ఉంటాయట. ఇక సీజనల్ వ్యాధులు అనగా జలుబు, దగ్గు, ఫ్లూ వంటి రోగాల కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి అలాంటి సీజనల్ వ్యాధులు సంభవించినప్పుడు చేపనూనె సప్లిమెంట్ తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి వ్యాధినైనా ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందట. ఇంకా పలు రకాల చర్మ వ్యాధులు అనగా గాయాలు, దద్దుర్లు, దురద వంటి సమస్యలను కూడా చేపనూనె తీసుకోవడం వల్ల దురమౌతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి చేపనూనె సప్లిమెంట్ తీసుకోవడం వల్ల ప్రయోజనలే ఎక్కువ అని, దాని వల్ల ఎలాంటి ప్రమాదాలు లేవని నిపుణులు చెబుతున్నా మాట.

 

- Advertisement -