Bigg Boss 7 Telugu:నామినేషన్స్ ప్రక్రియ..బూతు పురాణం

31
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 23 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌తో నాలుగో నామినేషన్స్ ప్రక్రియ పూర్తికాగా ఈ వారం 6 గురు నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు హౌస్ నుండి బయటకు రానున్నారు. ముందుగా గౌతమ్ కృష్ణ తన నామినేషన్ల గురించి మాట్లాడాడు. యావర్, తేజలను నామినేట్ చేస్తున్నానని… యావర్‌కి ఆటిడ్యూడ్ ప్రాబ్లమ్ ఉందని చెప్పారు. తర్వాత పెద్ద గొడవ జరగగా చివరికి యావర్‌ని నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది జ్యూరీ.

తర్వాత గార్డెన్‌లో కూర్చున్న గౌతమ్ దగ్గరికి వచ్చి అమర్ మాట్లాడాడు. ఈ క్రమంలో ఏమైనా జరగని.. చంపేస్తారా.. అంటూ భారీ డైలాగులు కొట్టాడు గౌతమ్. ఇక తర్వాత గౌతమ్ దగ్గరికి సందీప్ వచ్చి మాట్లాడాడు. నువ్వు అలా లాస్ట్‌లో వాడిన రెండు పదాలు (బూతులు) నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను అన్నాడు సందీప్. లాస్ట్‌లో డైరెక్ట్ నామినేషన్ ఏమైనా ఉంటే నాకేసేయండి.. నేను వెళ్లిపోతాను ఇక్కడ ఉండలేను అంటూ గౌతమ్ కోపంగా పక్కకి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత అమర్‌దీప్.. ప్రశాంత్, శుభశ్రీలను నామినేట్ చేస్తున్నట్లు చెప్పగా శుభశ్రీని నామినేట్ చేస్తున్నట్లు జ్యూరీ చెప్పింది. అయితే ఈ జడ్జిమెంట్ ఏమాత్రం కరెక్ట్ కాదంటూ సుబ్బు గొడవపడింది. నామినేషన్‌కి సరైన రీజన్ చెప్పాలి అంతే కానీ నేను చేశానని చేయడమేంటి అంటూ కొశ్చన్ చేసింది. ఇక తర్వాత ప్రశాంత్ ఛాన్స్ వచ్చింది. అమర్, గౌతమ్ ఇద్దరినీ నామినేట్ చేస్తున్నట్లు చెప్పగా గౌతమ్‌నే జ్యూరీ నామినేట్ చేసింది. ఆ తర్వాత గౌతమ్ మళ్లీ చొక్కా విప్పేసి నేను షర్ట్ విప్పి తిరిగితే మీకెవరికైనా ప్రాబ్లమా.. అంటూ అందరి దగ్గరికి వెళ్లి మళ్లీ అలానే ప్రవర్తించాడు.

ఇక నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా కిచెన్‌లో శుభశ్రీ-అమర్ మధ్య వాదన జరిగింది. ఈసారి నేను ఆడలేకపోతే నేనే ఇంట్లో నుంచి వెళ్లిపోతా.. నువ్వే కూర్చొని ఆడుకో.. అంటూ కిచెన్‌లో నుంచి తిట్టుకుంటూ అమర్ వెళ్లిపోయాడు. మొత్తంగా ఈ వారం నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా సాగింది.

Also Read:IND vs AUS : క్లీన్ స్వీప్ చేస్తే సంచలనమే !

- Advertisement -