బాలయ్య టీడీపీ పరువు తీస్తారా ? నిలబెడతారా?

38
- Advertisement -

రాజకీయాలకు సినిమాలకు అభినవ సంబంధం ఉందనే సంగతి అందరికి తెలిసిందే. ఎందుకంటే రెండు రంగాలకు కూడా ప్రజాకర్షణే మొదటి బలం. దాంతో సినీ రంగంలోని వాళ్ళు రాజకీయాల్లోకి రావడం, అలాగే రాజకీయ నాయకులు సినిమాలు తీయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సినిమాల నుంచి రాజకీయాలవైపు వెళ్ళిన వారు ఎన్టీ రామారావు, ఎంజిఆర్ లాంటి వాళ్ళు సక్సస్ అయితే.. చిరంజీవి, కమల్ హాసన్ వంటి వారు ఫెయిల్ అయ్యారు. ఇక ప్రస్తుత రాజకీయాలను పరిశీలిస్తే, బాలకృష్ణ,పవన్ కల్యాణ్ వాటి వారు సినీ రంగం నుంచి వచ్చి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇక అసలు విషయంలోకి వస్తే ప్రస్తుతం ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ లో భాగంగా జైల్లో ఉన్నారు.

ఇప్పుడు నారా లోకేశ్ కూడా జైలుకు వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీని ముందుండి నడిపే బాద్యతను నందమూరి బాలకృష్ణ తీసుకుంటున్నట్లు గత పది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా పార్టీ కార్యకలాపాలలో చురుకుగా ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు సీట్లోనే కూర్చోవడం, పార్టీని తాను ముందుండి నడిపిస్తానని వ్యాఖ్యానించడం వంటివి చూస్తుంటే బాలయ్య టీడీపీ బాద్యతలు భుజాన వేసుకున్నట్లే కనిపిస్తోంది. అయితే టీడీపీని బాలయ్య లీడ్ చేయడం ఆ పార్టీలోని మెజారిటీ నేతలకు నచ్చడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read:ఏ14గా లోకేశ్.. జైలు బాట తప్పదా?

ఎందుకంటే ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాడో అర్థం కానీ బాలయ్య పార్టీ పగ్గాలు చేపడితే టీడీపీని చేజెతులా నాశనం చేసినట్లే అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట. ఇక ఇటీవల బాలకృష్ణ అసెంబ్లీ వేధికగా చేసిన రకరక చేష్టలు కూడా పార్టీ ప్రతిష్టను మంటకలిపే విధంగా ఉన్నాయని వాపోతున్నారట, సాక్షాత్తు అసెంబ్లీలో అసభ్యకర సాయిగాలు చేయడం, కుర్చీలో నిలబడి నిరసనలు తెలపడం, ఈలలు, మీసాలు తిప్పడం వంటి చేష్టలు.. ప్రజా నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు కాదనే విమర్శలు వస్తున్నాయి. సినిమాలో మాదిరి రాజకీయాల్లో కూడా అలా చేస్తే ప్రజల నుంచే వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం ఉందని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారట. దీంతో ఒకవేళ బాలకృష్ణ పార్టీ పగ్గాలు చేపడితే పార్టీ పరువు పోవడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. మరి బాలయ్య టీడీపీ పరువు తీస్తారో.. నిలబెడతారో చూడాలి.

Also Read:గవర్నర్.. బీజేపీ చేతిలో కీలుబొమ్మా?

- Advertisement -