చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్ తొలి స్వర్ణం గెలుచుకుంది. భారత ఎయిర్ రైఫిల్ టీమ్ షూటర్లు 10 మీటర్ల ఈవెంట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ భారత్ స్కోరు 1893.7 నమోదు చేసింది. రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, దివ్యాంష్ సింగ్ పన్వార్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్లతో కూడిన షూటర్ల జట్టు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది.
బాకు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో చైనా నెలకొల్పిన ప్రపంచ రికార్డును అధిగమించారు.
ఇక తొలిరోజు భారత్ ఐదు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో మూడు రజత పతకాలు, రెండు కాంస్య పతకాలు లభించాయి.పురుషుల రోయింగ్ లైట్ డబుల్ స్కల్స్ విభాగంలో అర్జున్ జాట్, అరవింద్ సింగ్ ద్వయం 6:28:18సెకన్ల టైమింగ్ రెండో స్థానంలో నిలిచి రజత పతకంతో మెరిసింది.
పురుషుల ఎయిట్ ఈవెంట్ ఫైనల్లో నీరజ్, నర్కేశ్ కల్వానియా, నితీశ్ చరణ్ జస్విందర్ భీమ్ పునిత్ అశిశ్ కూడిన భారత రోయింగ్ బృందం 5:43:01సె టైమింగ్ రజత పతకాన్ని ముద్దాడింది. పురుషుల రోయింగ్ కాక్స్ పెయిర్ ఈవెంట్ తుదిపోరులో భారత ద్వయం బాబులాల్,లేఖ్ 6:50:41సెకన్ల టైమింగ్ మూడో స్థానంతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.
Also Read:Bigg Boss 7 Telugu:దామిని ఎలిమినేట్