తన అరెస్ట్ అక్రమమని ఏసీబీ న్యాయమూర్తితో తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. వీడియోకాల్ ద్వార చంద్రబాబుతో మాట్లాడారు జడ్జి.ఈ సందర్భంగా తనను అక్రమంగా కస్టడీలో ఉంచారని చెప్పారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కేవలం ఆరోపణల ఆధారంగా అరెస్ట్ చేశారని న్యాయమూర్తితో చెప్పారు. తనను జైలులో ఉంచి మానసిక హింసకు గురిచేస్తున్నారని, తన హక్కులను కాపాడాలని అభ్యర్థించారు.
ఇక చంద్రబాబు చెప్పిన విషయాలు అన్ని నోట్ చేసుకున్న జడ్జి..మరో రెండు రోజులు రిమాండ్ పొడగిస్తున్నట్లు చెప్పారు.రిమాండ్‌ని శిక్షగా భావించొద్దని మీరున్నది జ్యూడిషియల్ కస్టడీలో…పోలీస్ కస్టడీలో కాదన్నారు. జైల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ఏసీబీ కోర్టు రిమాండ్‌ని సెప్టెంబర్ 24 వరకు పొడిగించగా చంద్రబాబును పోలీస్ కస్టడీకి అప్పించే అవకాశాలున్నాయి.
Also Read:IND VS AUS:తొలి మ్యాచ్ లో సత్తా చాటేదేవరు?