రైల్వే కూలీగా మారిన రాహుల్!

60
- Advertisement -

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రైల్వే కూలీగా మారారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ వద్ద ఈ ఆసక్తికర సంఘటన జరుగగా చుట్టూ వందలాది మంది కూలీలతో సందడి వాతావరణం నెలకొంది. రైల్వే స్టేషన్‌ వద్ద రైల్వే కూలీలతో చాలా సేపు మాట్లాడారు. ఆ తరవాత పోర్టర్ డ్రెస్ వేసుకుని బ్యాడ్జ్ కూడా పెట్టుకున్నారు.

కూలీలా ఓ సూట్‌కేసుని కూడా మోశారు రాహుల్. రైల్వే కూలీలతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు రాహుల్ గాంధీ. కూలీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఓపిగ్గా కూలీలతో మాట్లాడాడమే కాదు…. వాళ్ల సమస్యలేంటో అడిగి తెలుసుకున్నారు.

Also Read:కొత్తిమీరతో ఆరోగ్య ప్రయోజనాలు..!

భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీలో బాగా మార్పువచ్చింది. ప్రజలతో మమేకమవుతూ వారి కష్టాలను తెలుసుకుంటున్నారు. ఈ ఏడాది ఆగస్టులో ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండీకి వెళ్లారు. అక్కడ పండ్లు, కూరగాయలు అమ్ముకునే వ్యాపారులను కలిసి మాట్లాడారు. తర్వాత హరియాణాలోని రైతులను కలిశారు రాహుల్. పొలంలోకి దిగి రైతులతో మాట్లాడారు. ట్రాక్టర్‌తో దున్నారు.

Also Read:సినీ ప్రపంచంలో ఆడవాళ్ళకు విలువ లేదా?

- Advertisement -