ఆసీస్ తో పోరు.. టీమిండియాకు అగ్నిపరిక్షే?

43
- Advertisement -

ప్రస్తుతం ఆసియా కప్పు గెలిచిన ఆనందంలో ఉంది టీమిండియా మరో రెండు వారాల్లో జరగనున్న వరల్డ్ కప్పు కు ముందు ఆసియా కప్ లాంటి మెగా టోర్నీని గెలవడం టీమిండియాకు అత్యంత సానుకూలాంశం. వరల్డ్ కప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ వరల్డ్ కప్ కు ముందు భారత్ ఆస్ట్రేలియా జట్టుతో మూడు వన్డేల సిరీస్ అడనుంది. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా, భారత్ ఇప్పటికే తమ టీం లను కూడా ప్రకటించాయి. ఆసీస్ కేవలం ఒకే టీంతో బరిలో దిగనుండగా టీమిండియా మాత్రం కేల్ రాహుల్ సారథ్యంలో ఒక టీం, రోహిత్ శర్మ సారథ్యంలో మరో టీం తో బరిలోకి దిగనుంది. .

వరల్డ్ కప్ కు ముందు కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చేందుకే బీసీసీఐ ఇలా చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే వరర్డ్ కప్ కు ముందు జరిగే ఈ సిరీస్ టీమిండియాకు అత్యంత కీలకం. ఈ సిరీస్ గెలిగే వన్డేలలో నెంబర్ ఒన్ జట్టుగా వరల్డ్ కప్ టోర్నీ లో అడుగు పెడుతుంది. ఇది ప్లేయర్స్ లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రస్తుతం వన్డేలలో పాకిస్తాన్ మొదటి ప్లేస్ లో ఉంది. ఆ తరువాతి స్థానాల్లో ఆస్ట్రేలియా టీమిండియా జట్లు సమంగా ఉన్నాయి. ఈ సిరీస్ లో గెలిచిన జట్టు వన్డే ర్యాంకింగ్ ప్రకారం మొదటి స్థానంలో నిలుస్తుంది.

Also Read:నూడుల్స్ తింటున్నారా.. జాగ్రత్త !

అందుకే ఈ సిరీస్ గెలవడం టీమిండియా కు ఎంతో ముఖ్యం. అయితే ఎప్పటివరకు ఆస్ట్రేలియాతో 146 మ్యాచ్ లు అడగా, ఆసీస్ దే పై చేయిగా ఉంది. ఆస్ట్రేలియా 82 మ్యాచ్ లలో గెలవగా, టీమిండియా మాత్రం 67 మ్యాచ్ లలోనే విజయం సాధించింది. మరో పది మ్యాచ్ లు మాత్రం ఫలితం తేలనివిగా ఉన్నాయి. దీంతో ఏ రకంగా చూసిన టీమిండియాపై ఆస్ట్రేలియాదే పైచేయిగా ఉంది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ కు ముందు ఈ సిరీస్ ఓటమి పలు అయితే టీమిండియా ప్లేయర్స్ లో కాన్ఫిడెంట్ సన్నగిల్లే అవకాశం ఉంది. అందుకే ఆసీస్ తో జరిగే సిరీస్ లో టీమిండియా గెలవడం అత్యంత కీలకం. మరి మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియాపై పైచేయి సాధిస్తుందో లేదో చూడాలి.

Also Read:అతిథి…ఫ్యామిలీ ఎంటర్ టైనర్

- Advertisement -