ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ పై రోజుకో కొత్త వాదన తెరపైకి వస్తోంది. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని ఏపీ సీఐడీ పై టిడిపి నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి విధితమే. అటు చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానంపై ఇతరత్రా పార్టీ నేతలు కూడా తీవ్రంగా తప్పుబడుతున్నారు. దీంతో వైఎస్ జగన్ కక్ష పూరితంగానే చంద్రబాబు అరెస్ట్ ను ప్లాన్ చేశారా ? అనే అనుమానాలు చాలమందిలో వ్యక్తమౌతున్నాయి. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంతి ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం, సరైన ఆధారాలు లేకున్నా జైల్లో వేయడం వంటి పరిణామాలు గమనిస్తే కక్ష పూరితంగానే జరిగిందనేది కొందరి వాదన.
కాగా చంద్రబాబు అరెస్ట్ వెనుక వైఎస్ జగన్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అయితే ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయించే సాహసం జగన్ ఎందుకు చేశారు ? అలా చేయడానికి జగన్ కు ఉన్న దైర్యమేంటి ? అనే ప్రశ్నలు టీడీపీ నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్రం హస్తం కూడా ఉందనేది ప్రధానంగా వినిపిస్తున్న వాదన. ఎందుకంటే వైఎస్ జగన్ తో కేంద్ర పెద్దలు సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. దాంతో ఆ సత్సంబంధాల కారణంగానే చంద్రబాబు అరెస్ట్ కు కేంద్రం సహకరించిందనేది కొందరి వాదన.
అయితే చంద్రబాబు అరెస్ట్ తో కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదని ఏపీ బిజెపి చీఫ్ పురందేశ్వరి ఇటీవల చెప్పుకొచ్చారు. అయితే ఆసక్తికర విషయం ఏమిటంటే చంద్రబాబు అరెస్ట్ ను కేంద్ర ఏజెన్సీలే తేల్చాయని ఏపీ మంత్రి వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో చంద్రబాబు అరెస్ట్ వెనక కేంద్ర హస్తం ఉందని ధర్మాన చెప్పకనే చెప్పారు. గత కొన్నాళ్లుగా బిజెపితో దోస్తీ కోసం చంద్రబాబు తెగ ప్రయత్నిస్తూ వచ్చారు. కానీ బిజెపి మాత్రం టీడీపీతో చేతులు కలిపేందుకు ససేమిరా అంటూ వచ్చింది. కానీ అటువైపు జగన్ కు మాత్రం అన్నీ విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వచ్చింది కేంద్రం. దీంతో వైసీపీ బీజేపీ మద్య అంతర్గత పొత్తు ఉందనేది టీడీపీ శ్రేణులు ఎప్పటి నుంచో చెబుతున్నా మాట. దాంతో వచ్చే ఎన్నికల్లో జగన్ అడ్డు ఉండకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు అరెస్ట్ కు కేంద్రం సహకరించిందనేది కొందరు చెబుతున్న మాట.
Also Read:పవన్ డైరెక్షన్ లో టీడీపీ ?