ఏపీ రాజకీయ పరిణామాలు అనుక్షణం ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు జైలు కు వెళ్ళడం, ఊహించని విధంగా పవన్ టీడీపీతో పొత్తు ప్రకటించడం బిజెపి కన్ఫ్యూజన్ లో పడిపోవడం.. ఇలా విశ్లేషకులకు సైతం అంతు చిక్కని విధంగా ఏపీ రాజకీయాలు సాగుతున్నాయి. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో ఉన్నారు. ఎప్పుడు బయటకు వస్తారనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఎన్నికల సమయనికైనా ఆయన బయటకు వస్తారా అంటే చెప్పడం కష్టమే. ఈ నేపథ్యంలో టీడీపీ పరిస్థితి ఏంటి అనేది గందరగోళంగా మారింది. ఎదుకంటే అధినేత జైల్లో ఉండడంతో టీడీపీని ముందుండి నడిపించే నాయకత్వ కొరత ఏర్పడింది. .
నారా లోకేశ్ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికి పార్టీని ముందుండి నడిపే సత్తా ఆయనకు లేదనేది సొంత పార్టీ నేతలే చెబుతున్నా మాట. ఇటు హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య ప్రస్తుతం యాక్టివ్ గా కనిపిస్తున్నారు. బావ జైల్లో ఉన్నది మొదలుకొని పార్టీని లీడ్ చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. అయితే బాలయ్య ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యాలు చేస్తారో అనేది ఊహించడం కష్టం. బాలయ్య నోటి దురుసు కారణంగా తొందరపడి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన పార్టీకే తీరని నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తులో ఉన్న పవన్ డైరెక్షన్ లోనే ముందుకు సాగాలని టీడీపీ శ్రేణులు డిసైడ్ అయ్యారట.
జైల్లో ఉన్న చంద్రబాబుతో పవన్ ఆ మద్య మూలాఖత్ అయ్యారు. ఆ తరువాత వెంటనే టీడీపీతో పొత్తును ప్రకటించారు పవన్. అయితే జైల్లో చంద్రబాబు పవన్ కు ఏం చెప్పారనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అయితే రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం. టీడీపీ బాద్యతను పవన్ కు అప్పటించారట చంద్రబాబు. పవన్ అనూహ్యంగా పొత్తు ప్రకతైంచడానికి కూడా కారణం అదేనట. ఇక టీడీపీతో పొత్తు తరువాత ఇరు పార్టీల మద్య దోస్తీ బలోపేతం కోసం సమన్వయ కమిటీ ఏర్పాటు దిశగా కూడా పవన్ అడుగులు వేస్తున్నారు. అటు టీడీపీ కూడా సమన్వయ కమిటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ కమిటీలు పవన్ డైరెక్షన్ లోనే సాగానున్నాయనేది అంతర్గతంగా వినిపిస్తున్న మాట. మొత్తానికి నాయకత్వ కొరత ఉన్న టీడీపీకి పవన్ డైర్తెక్షన్ ఆ పార్టీకి ఎంతవరకు ఉపయోగ పడుతుందో చూడాలి.
Also Read:కాకరకాయ జ్యూస్..ఇలా తాగితే రోగాలన్నీ మటాష్!