ప్రభాస్ మారుతి సినిమా వచ్చేది అప్పుడే..?

35
- Advertisement -

నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ నెల సలార్ మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా ఇతరత్రా కారణాల వల్ల ఆ మూవీ వాయిదా పడింది. ఇక ప్రస్తుతం ప్రాజెక్ట్ కె మరియు మారుతి డైరెక్షన్ లో చేస్తున్న మూవీతో బిజీగా ఉన్నాడు డార్లింగ్. అయితే మారుతి మూవీని ఇంతవరకు అధికారికంగా ప్రకటించకుండానే షూటింగ్ ను జట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికీ మూవీ 40 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. .

ఈ మూవీని హర్రర్ బ్యాక్ డ్రాప్ లో మారుతి తెరకెక్కిస్తున్నాడట. ఇక ఈ మూవీలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఆ మద్య మూవీ సెట్స్ నుంచి లీక్ అయిన ఫోటోస్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. చాలా రోజుల తరువాత ప్రభాస్ ను వింటేజ్ లుక్ లో చూస్తుండడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ మూవీకి రాజా డీలక్స్ అనే టైటిల్ ప్రచారంలో ఉన్నప్పటికి మరో రెండు టైటిల్స్ ను కూడా చిత్రా యూనిట్ పరిశీలిస్తుందట. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది.

Also Read:పుష్ప 2 వెనక్కి తగ్గాల్సిందేనా ?

అసలు ఈ మూవీ విషయంలో ప్రభాస్ ప్లాన్ ఏంటి అనే ప్రశ్నలు అభిమానుల్లో కన్ఫ్యూజన్ పెంచుతున్నాయి. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని ” కల్కి 2598 ఏడి ” మూవీ విడుదల అయిన తరువాత రిలీజ్ చేస్తారని టాక్. అది కూడా కేవలం తెలుగులో మాత్రమే విడుదల చేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ సినిమా కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ అవ్వడం సమంజసం కాదనేది కొందరి అభిప్రాయం. మరి మారుతి సినిమాపై ఎలాంటి అప్డేట్స్ బయటకు రావాలన్న ” కల్కి 2898 ఏడి ” మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయక తప్పదు.

Also Read:రాత్రి పూట తేనె తినడం మంచిదేనా?

- Advertisement -