53 ఏళ్లకు ఆ నటికి పెళ్లి పై ఆసక్తి

43
- Advertisement -

మీకు సీనియర్ హీరోయిన్ శోభన గుర్తుందా ?, నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన ఆమె తెలుగు తెర పై తనదైన ముద్ర వేశారు. పైగా ఒకప్పుడు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన హోమ్లీ హీరోయిన్స్ లో ఆమె కూడా ఒకరు. మరి ఆ అందాల నటికి ఇంకా పెళ్లి కాలేదనే విషయం తెలిస్తే కొంతమంది ఆశ్చర్యపోతారు. నిజం.. సీనియర్ హీరోయిన్ శోభన కు ఇంకా పెళ్లికాలేదు. ఆమె వయసు ప్రస్తుతం 53 సంవత్సరాలు. దాదాపు 3 దశాబ్దాలుగా పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చింది. గతంలో పెళ్లి విషయంలో శోభన ను మీడియా పలుమార్లు ప్రశ్నిస్తే, తనకు పెళ్లి కంటే కూడా నాట్యమే ముఖ్యం అని, అయినా నా పెళ్లి పై మీకెందుకు ఆసక్తి అంటూ రివర్స్ లో ప్రశ్నించింది.

మొత్తానికి ఆ బంధంలోకి అడుగుపెట్టాలని లేదంటూ, నాట్యం కోసమే తన జీవితం అంటూ శోభన కరాఖండిగా చెప్పింది. ఆమె చెప్పినట్టుగానే ఇన్నేళ్లు నాట్యం కోసం పని చేశారు. ఎందరో పేద వారికీ నటి శోభన నాట్యం నేర్పించారు. ఐతే, ఎట్టకేలకు శోభన మనసు మారినట్టుంది. తాజాగా పెళ్లిపై ఈసారి పాజిటివ్ గా స్పందించింది శోభన. ప్రస్తుతం తనకూ పెళ్లి చేసుకోవాలని ఉందంటూ శోభన ప్రకటించింది. తను వివాహం చేసుకోకూడదని పెట్టుకున్న నియమానికి తాను ప్రస్తుతం కట్టుబడి లేను అని శోభన అన్నారు.

పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలని, కుటుంబంతో కలిసి ఉండాలని తనకు అప్పుడప్పుడు అనిపిస్తుందని శోభన చెప్పుకొచ్చింది. గతంలో శోభన పై చాలా పుకార్లు వచ్చాయి. ఓ సీనియర్ నిర్మాతతో ఆమె ప్రేమలో ఉన్నారని కథనాలు వచ్చాయి. కానీ అవేమి రుజువు కాలేదు. ఆమె కేవలం నాట్యం కోసమే బతకాలని నిర్ణయించుకున్నారు. అందుకు ఓ కారణం ఉంది. నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిలకు శోభన స్వయానా మేనకోడలు. అందుకే, ఆమె ఆ నిర్ణయం తీసుకున్నారు.. మరి ప్రస్తుతం ఆమె మనసు పెళ్లి పై వెళ్ళింది. మరి ఆమె నిజంగానే పెళ్లి చేసుకుంటుందో ? లేదో ? చూడాలి.

Also Read:ప్రభాస్ ఉండగా ఆమె కొడితే ఎలా ?

- Advertisement -