కాంగ్రెస్, బిజెపి శత్రుత్వ ముసుగులో మిత్రుత్వం?

20
- Advertisement -

కాంగ్రెస్, బిజెపి మద్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయ వివాదాలు ఉంటాయని భావిస్తారంతా. ఆ రెండు పార్టీలు పైపైకి కూడా అలాగే వ్యవహరిస్తాయి. కానీ నిజానికి ఆ రెండు పార్టీలు రాజకీయ వ్యూహాలు తెలిసిన ఆప్త మిత్రులు. అదేంటి ప్రత్యర్థి పార్టీలను మిత్రులతో పోల్చడమేంటి అనే సందేహాలు రావడం సహజమే. కానీ ఈ రెండు పార్టీల వైఖరి గురించి తెలిసిన ఎవరైనా రాజకీయ విశ్లేషకులేవరైనా కాంగ్రెస్ బీజేపీ మద్య ఉండే మిత్రుత్వం గురించి విపులంగా చెప్పేస్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడూ బీజేపీ వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చడం. అలాగే బీజేపీ అధికారంలో ఉన్న ప్రజెంట్ రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళ అవినీతిని మరుగు చేయడం అంతర్గతంగా జరుగుతూ వస్తోంది..

ఇలా శతృత్వం ముసుగులో మిత్రుత్వం సాగించే ఈ రెండు పార్టీలు దేశ సంపదను లూటీ చేయడమే ఎజెండాగా ముందుకు సాగుతున్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, మరియు రాహుల్ గాంధీ దొషులని ఆధారాలతో సహ బయట పడిన సంగతి విధితమే. కానీ ఇంతవరకు ఆ కేసు ఎందుకు మరుగున పడిందనేది బహిరంగ రహస్యం. ఇలా చాలా అవినీతి అంశాలలో ఒక పార్టీకి మరో పార్టీ కొమ్ముకాస్తు వస్తున్నాయి కాంగ్రెస్ మరియు బీజేపీలు. ఇదేంటి అని ప్రశ్నించిన వారిపై మాత్రం అక్రమ కేసులు బనాయించి ప్రశ్నించే నోళ్లను మూయించే దొరణిలో ఉన్నారు కేంద్ర అధికార నేతలు.

అయితే ఈ రెండు అవినీతి పార్టీల గుప్పిట్లోనే దేశం ఉండాలా ? మార్పు రావాల్సిన అవసరం లేదా ? అంటే తప్పకుండా మార్పు రావాల్సిన అవసరత ఉంది. ఆ మార్పు కోసమే దేశ రాజకీయాల్లోకి తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ ఎంట్రీ ఇచ్చారు. ఒకప్పుడు తెలంగాణ కోసం ఒంటరి పోరు సాగించిన కే‌సి‌ఆర్.. తన పట్టుదలతో రాష్ట్రాన్ని సాధించారు. ఇప్పుడు అవినీతి పార్టీల గుప్పిట్లో ఉన్న దేశాన్ని విడిపించి ప్రత్యామ్నాయ శక్తిగా మారెందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా బి‌ఆర్‌ఎస్ నినాదాలు అంతకంతకు పెరుగుతున్నాయి. మరి ముందు రోజుల్లో శత్రుత్వం ముసుగులో ఉన్న మిత్రుత్వ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ లకు చెక్ పెట్టడం ఖాయమనే చెప్పవచ్చు.

Also Read:వైరల్..సల్మాన్‌తో సమంత!

- Advertisement -