కాంగ్రెస్‌లో ఐరన్ లెగ్ అన్నాచెల్లెళ్లు.!

30
- Advertisement -

ఐరన్ లెగ్స్ ను జేబులో పెట్టుకుని.. తాము తెలంగాణలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న మాటలు చూస్తోంటే జాలి వేస్తోందన్నారు రెడ్కో ఛైర్మన్ సతీష్ రెడ్డి. కాంగ్రెస్ నేతలు తలకిందులుగా తపస్సు చేసినా తెలంగాణలో అధికారం కాదు కదా.. కనీసం దాని దరిదాపులకు కూడా వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆ పార్టీలో రేవంత్ రెడ్డి, సీతక్క అనే ఇద్దరు ఐరన్ లెగ్స్ ఉన్నారు. వాళ్ల ట్రాక్ రికార్డ్ తెలియకుండా ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. ఈ అన్నాచెల్లెళ్లు ఉన్న ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు అధికారంలోకి రాలేదన్నారు.

పైగా వీళ్లు అడుగుపెట్టారంటే ఆ పార్టీ భూస్థాపితం కావాల్సిందే. రేవంత్ రెడ్డి 2007లో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇక.. ప్రస్తుతం ములుగు ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క 2004లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటికే అధికారానికి దూరమైన టీడీపీ.. వీళ్ల దెబ్బకు తెలంగాణలో పూర్తిగా భూస్థాపితమైంది. టీడీపీ భూస్థాపితమయ్యాక 2017లో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆ వెంటే సీతక్క కూడా కాంగ్రెస్ లో చేరారు. వీళ్లొచ్చాక ఆ పార్టీ అధికారానికి దూరమైంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక భూతద్దం పెట్టి చూసినా తెలంగాణలో కాంగ్రెస్ కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక జరిగిన రెండు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు భూస్థాపితానికి దగ్గరైందని మండిపడ్డారు.

Also Read:బాబు అరెస్ట్ పై అందుకే ఎన్టీఆర్ దూరం

సీతక్క ఉన్న 13 ఏళ్లు, రేవంత్ రెడ్డి ఉన్న 10 ఏళ్లు టీడీపీ అధికారంలోకి రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది అదే పరిస్థితి. ఇప్పటికే పాతాళంలోకి వెళ్లిపోయింది. ఈ 6 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కూడా అధికారానికి దూరమైంది. డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోతోంది. డిజాస్టర్ లో ఇది వీళ్ల ట్రాక్ రికార్డ్. సాధారణ నాయకులుగా ఉన్నప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వీళ్లిద్దరూ ముఖ్య నాయకులుగా ఉన్నారు. అంటే ఐరన్ లెగ్ ఎఫెక్ట్ ఇంకెంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి అన్నాచెల్లెళ్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. తాము గెలుస్తామని చెప్పుకుని తిరగడం హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణ ప్రజలు ఇలా దందాల కోసం జెండాలు మార్చే నాయకులను, పార్టీలను దగ్గరకు రానివ్వరు. రాష్ట్ర బాగు కోసం నిరంతరం పనిచేస్తున్న కేసీఆర్ గా వెంట, బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉండాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. మీరు ఎన్ని ఎత్తులు వేసినా, నక్కజిత్తులు ప్రయోగించినా ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని పట్టించుకోదన్నారు.

Also Read:బాబు అరెస్ట్ పై అందుకే ఎన్టీఆర్ దూరం

- Advertisement -