క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫస్ట్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం హను-మాన్. టాలెంటెడ్ యంగ్ హీరో తేజ సజ్జా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి తొలి చిత్రంగా వస్తున్న హను-మాన్ అన్ని భాషల ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని అనుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది.
ఈ చిత్రంను వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా ప్రమోషన్స్ ను వినాయక చవితి పండుగ నుండి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా వేదిక గా వెల్లడించారు. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Also Read:Prabhas:సలార్ వాయిదా