KTR:మళ్లీ అధికారం మాదే

19
- Advertisement -

 మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తేల్చిచెప్పారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ హైటెక్స్‎లో ఏర్పాటుచేసిన టైమ్స్ ఆఫ్ ఇండియా, టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్ పో-2023ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నిర్వాహకులను అభినందిస్తూ..మళ్లీ వచ్చే ఏడాది కూడా ఈ ప్రాపర్టీ ఎక్స్‌ పోను నిర్వహించాలని మళ్లీ తానేవచ్చి ప్రారంభిస్తానని ఎందుకంటే వచ్చేది బీఆర్ఎస్‌ సర్కారేనని తేల్చిచెప్పారు.

సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం అన్ని రంగాలపై ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వం ముందుచూపుతో దృష్టి సారించిందన్నారు. తెలంగాణ రాకముందు ఏడు వేల మెగావాట్ల విద్యుత్ ఉండేది, పవర్ హాలిడేస్‎తో పరిశ్రమలకు సెలవులు కూడా ఇచ్చే వాళ్లని చెప్పారు. ఇటు కాళేశ్వరం, అటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 10 శాతం తాగు నీటిని అందిస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌కు భవిష్యత్తులో తాగునీటి కొరత ఉండదని స్పష్టం చేశారు.

Also Read:ఏపీ ఫైబర్ స్కామ్‌లో లోకేష్!

రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్‎కే పరిమితం కాలేదు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెరిగిందని వెల్లడించారు. మెట్రో రైలును విస్తరిస్తామని, మూసీ సుందరీకరణ చేస్తామన్నారు. గొప్ప విజనరీ లీడర్ మన కేసీఆర్ ఉన్నారని, హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. హైదరాబాద్ అంటే గచ్చిబౌలి, కొండాపూర్ అని కొంత మంది విమర్శిస్తున్నారని, న్యూయార్క్‌ లాంటి నగరాల్లో కూడా కొన్ని పాత పట్టణాలు ఉన్నాయని చెప్పారు.

Also Read:Chandrababu:తప్పు చేస్తే ఉరేయండి

- Advertisement -