ఐపీఎల్‌లో మలింగ రికార్డ్‌.. 150 నాటౌట్‌ !

234
lasith-malinga-becomes-first-reach-150-ipl-wickets
- Advertisement -

ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ లసిత్‌ మలింగ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఐపీఎల్‌ చరిత్రలో 150వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా మలింగ రికార్డు సృష్టించాడు. టోర్నీలో భాగంగా ముంబయి ఇండియన్స్‌-దిల్లీ డేర్‌డెవిల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో లతీశ్‌ మలింగ ఈ ఘనతను అందుకున్నాడు. ఢిల్లీ ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ వేసిన మలింగ.. ఆ ఓవర్లో ఐదో బంతికి ఢిల్లీ బ్యాట్స్‌ మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(3)ను ఔట చేయడంతో ఈ ఫీట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు మలింగ.

ముంబయి ఇండియన్స్‌ తరఫున మలింగ 105 మ్యాచుల ద్వారా 151 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మలింగ ఉత్తమ ప్రదర్శన 5/13గా ఉంది. వంద వికెట్లకు పైగా తీసిన బౌలర్లలో 18.47 సగటుతో అందరికంటే ముందున్నాడు. 2009నుంచి ముంబయి ఇండియన్స్‌ జట్టు తరపున ఆడుతున్న మలింగ… గాయం కారణంగా 2016 సీజన్‌ మొత్తానికి అతడు దూరమయ్యాడు. 2011 ఐపీఎల్‌లో అత్యధికంగా 28వికెట్లు తీశాడు.

malinga

2013, 15లో ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచిన ముంబయి జట్టులో మలింగ సభ్యుడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లాడిన మలింగ ఎనిమిది వికెట్లు తీశాడు. ఐపీఎల్‌ అత్యధిక వికెట్లు తీసిన వారిలో మలింగ తర్వాతి స్థానాల్లో అమిత్‌ మిశ్రా(137), హర్భజన్‌ సింగ్‌(127) ఉన్నారు.

- Advertisement -