- Advertisement -
రాహుల్ గాంధీ..తన వ్యవహార శైలీ పూర్తిగా మార్చేశారు. గాంధీ కుటుంబ వారసుడిగా ముద్రతో ఇప్పటివరకు ఉన్న రాహుల్ ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేక స్ధానాన్ని సంపాదించుకుని ముందుకుసాగుతున్నారు. వేసే ప్రతి అడుగులో తనను తాను ప్రజా నాయకుడిగా మలుచుకుంటున్నారు. ఇక రాహుల్‌ని మొదటి నుండి చూసిన వాళ్లు సైతం నివ్వెర పోయేలా తాము చూస్తున్నది రాహుల్నేనా అనేంతలా ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు.
తాజాగా బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌తో కలిసి మటన్ వండారు రాహుల్. లాలూతో కలిసి మటన్ ముక్కల్లో మసాలా, ఉప్పు, కారం, పసుపు వేసి రాహుల్ గరిటె తిప్పారు.
అనంతరం లాలూతో కలిసి భోజనం చేశారు. తాజా రాజకీయాలపై చర్చలు జరిపారు. మటన్ వండిన రాహుల్ వీడియోను కాంగ్రెస్ పార్టీ శనివారం విడుదల చేయగా వైరల్‌గా మారింది.
Also Read:లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో “ఖుషి” టీమ్
- Advertisement -