- Advertisement -
కాంగ్రెస్ నాయకుల తీరుపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. ప్రజలను నిలువునా మోసం చేస్తున్న పార్టీ..కాంగ్రెస్ పార్టీ అని నిప్పులు చెరిగారు. ఈ మేరకు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్‌తో రేవంత్ రెడ్డి ఉన్న ఫోటోను షేర్ చేసిన కవిత…అప్పుడు ఢిల్లీ.. ఇప్పుడు ఢిల్లీ.. కానీ ఇప్పుడు వయా బెంగళూరు అంటూ ఎద్దేవా చేశారు. బెంగళూరు కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తుందని…కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టడం అని ధ్వజమెత్తారు.
అప్పుడు ఢిల్లీ
ఇప్పుడు ఢిల్లీ… కానీ ఇప్పుడు వయా బెంగళూరుకాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం…
ఢిల్లీ గల్లీలలో మోకరిల్లడం… pic.twitter.com/dRJN89lamJ— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 2, 2023
Also Read:మళ్లీ నిరాశపర్చిన ప్రభాస్ ‘సలార్’!
- Advertisement -