‘మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి’ సెన్సార్ రివ్యూ

50
- Advertisement -

న‌వీన్ పోలిశెట్టి, అనుష్కశెట్టి ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌స్తున్న సినిమా మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి. యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో మ‌హేష్ బాబు ద‌ర్శ‌కత్వంలో రూపొందిన‌ ఈ సినిమా సెప్టెంబ‌ర్ 7న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుని యూ/ఏ స‌ర్టిఫికేట్ అందుకుంది. మరి ఈ మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టికి సెన్సార్ టాక్ ఎలా ఉంది ?, సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఏమంటున్నారు ?, చూద్దాం రండి.

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. కామెడీ డ్రామాలు ఇష్టపడే ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే సినిమా ఇది. ముందుగా సినిమాలో మెయిన్ హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్వెల్ కి ముందు వచ్చే అనుష్క శెట్టి పాత్రకు సంబంధించిన కామెడీ సీక్వెన్స్, అలాగే అనుష్క శెట్టి పాత్రతో ముడిపడిన మిగిలిన పాత్రల ఎమోషన్స్ అద్భుతంగా అనిపిస్తాయి. అలాగే, నవీన్ పోలిశెట్టి కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి.

పైగా నవీన్ పోలిశెట్టి క్యారెక్టర్ కూడా బాగా ఎలివేట్ అయ్యింది. ఎప్పటిలాగే నవీన్ పోలిశెట్టి చాలా బాగా నటించాడు. అనుష్క శెట్టితో సాగే నవీన్ ట్రాక్ అయితే, ఒక సర్‌ప్రైజ్‌ ప్యాకేజ్ అట. ఇక చివర్లో అనుష్క శెట్టి పాత్ర ద్వారా సెంటమెంట్ ను ఇలా కూడా చూపించిచ్చా అని దర్శకుడు మ‌హేష్ బాబు ఆశ్చర్యపరిచాడట. మొత్తమ్మీద కామెడీ ఆడియన్స్ కి కావాల్సిన అన్ని అంశాలు ఈ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలో ఫుల్ గా ఉన్నాయి. కానీ ఫ్యామిలీ అంతా కలిసి ఈ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా చూడటానికి థియేటర్స్ కి వస్తారా ? చూడాలి.

Also Read:అదే జరిగితే హస్తం “అల్లకల్లోలం ” !

- Advertisement -