తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు వడ్డించేందుకు అన్నప్రసాదాల తయారీకి గాను క్రమంగా ఆర్గానిక్ కూరగాయల సరఫరాను పెంచాలని దాతలను టీటీడీ ఈవో ధర్మారెడ్డి కోరారు. తిరుమల అన్నమయ్య భవనంలో కూరగాయల దాతలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఉండడంతో భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలు అందించేందుకు అన్ని రకాల కూరగాయలు సరఫరా చేయాలని కోరారు. దాతలు ఎంతో సహకారం అందిస్తున్నారన్నారు.
2004వ సంవత్సరం నుండి నిరంతరాయంగా కూరగాయల సరఫరా జరుగుతోందని వివరించారు. తాజా కూరగాయలు సరఫరా చేస్తుండడంతో అన్నప్రసాదాలు రుచికరంగా, నాణ్యంగా ఉంటున్నాయన్నారు. ఆర్గానిక్ కూరగాయలతో వంట రుచికరంగా ఉండడంతో పాటు ఆరోగ్యకరమని తెలిపారు.
Also Read:హీరోగా విజయ్ తనయుడు జాసన్ సంజయ్