సిట్టింగ్ లకు ” బాబు స్ట్రోక్ ” ?

34
- Advertisement -

వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సరికొత్త ప్రణాళికతో రంగంలోకి దిగబోతున్నారా ? ఎన్నికల్లో గెలవాలంటే మార్పు తప్పదని చంద్రబాబు బావిస్తున్నారా ? బాలు ప్లాన్స్ సొంత పార్టీ నేతలనే కలవరపెడుతోందా ? ప్రస్తుతం ఈ ప్రశ్నలు ఏపీ పోలిటికల్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే వచ్చే ఎన్నికలు టీడీపీకి డూ ఆర్ డై లాంటివి కావడంతో వేసే ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నారు అధినేత చంద్రబాబు. గత ఎన్నికల్లో ఊహించని రీతిలో ఘోర ఓటమి చవిచూసిన టీడీపీ.. ఈసారి అలాంటి పరాభవం ఎదురుకాకుండా ఉండాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని చంద్రబాబు భావిస్తున్నారట.

గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లలోనే టీడీపీ విజయం సాధించింది. ఇక ఈసారి మాత్రం 160 సీట్లలో విజయం సాధించాలని టీడీపీ టార్గెట్ గా పెట్టుకుంది. మరి అంత భారీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే సరైన అభ్యర్థులను బరిలో దించడం చాలా అవసరం. అందుకే ఈసారి దాదాపు 50 శాతం కొత్తవారికే సీట్లు కేటాయిస్తామని గతంలోనే బాబు క్లారిటీ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి.. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఎంతమందికి సీట్లు రావచ్చు అనేదే ఆసక్తికరంగా మారిన ప్రశ్న.

ప్రస్తుతం ఉన్న 23 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 14 మంది పై ప్రజా వ్యతిరేకత ఉన్నట్లు టీడీపీ అంతర్గత సర్వేలలో తేలిందట. అందుకే ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కూడా మార్పు తప్పదని రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. ఒకవేళ అదే గనుక జరిగితే పార్టీలో అసంతృప్త వాదులు పెరిగే అవకాశం ఉంది. అసలే యాబై శాతం కొత్తవారు మళ్ళీ సిట్టింగ్ స్థానాల్లో కూడా మార్పు.. మొత్తం మీద చంద్రబాబు ప్రయోగాత్మక ప్రణాళికలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read:సి‌ఎం అభ్యర్థిపై క్లారిటీ వచ్చేనా ?

- Advertisement -