Chandrayaan-3:జాబిల్లిపై చెరగని ముద్ర

42
- Advertisement -

ఇస్రో ప్రవేశపెట్టిన చంద్రయాన్ 3 చంద్రుడిపై ల్యాండ్ కావడానికి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. జాబిలిపై చెరగని ముద్ర వేసే అద్భుత ఘట్టం కోసం యావత్ భారతావనితో పాటు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇవాళ సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టనుంది. ఈ అద్భుత దృశ్యాన్ని లైవ్‌లో వీక్షించేలా ఇస్రో అన్ని ఏర్పాట్లు చేయగా తెలంగాణ ప్రభుత్వం కూడా స్కూళ్ల టైమింగ్‌ను పొడగించి విద్యార్ధులందరూ ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించేలా సర్వం సిద్ధం చేసింది.

సాయంత్రం 5.45 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియను చేపట్టనుండగా.. ఇది 20 నిమిషాల పాటు కొనసాగనుంది. ఈ 20 నిమిషాలు అత్యంత కీలకం. ప్రస్తుతం చంద్రుడి ఉపరితలానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న విక్రమ్ ల్యాండర్.. ల్యాండింగ్ సమయంలో ఉపరితలం వైపు సెకనుకు 1.68 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. విక్రమ్ ల్యాండర్ తనంతట తానుగా ఇంజిన్లు మండిస్తూ వేగాన్ని తగ్గిస్తుంది రఫ్ బ్రేకింగ్ ఫేజ్ గా దీనిని పిలవనుండగా దాదాపు 11 నిమిషాల పాటు కొనసాగుతుంది.

తర్వాత ‘ఫైన్ బ్రేకింగ్ దశ’ ప్రారంభంకానుండగా గతంలో ఈ దశలోనే చంద్రయాన్ -2లోని విక్రమ్ ల్యాండర్ అదుపు తప్పి కూలిపోయింది.

Also Read:మహేష్‌తో అక్కడ ప్లాన్ చేశాడు!

- Advertisement -