మెగా బర్త్ డే స్పెషల్‌.. 2 సినిమాలు

55
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాల అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా ఆయన పెద్ద కూతురు సుస్మిత కొణిదెల నిర్మాత( గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్)గా చిరంజీవి 156వ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ సినిమాకి కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మెగాస్టార్‌తో సుస్మిత సినిమా ప్రకటించింది. ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మించి.. క్యాష్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు సుస్మిత.

ఇటు మెగాస్టార్ సైతం ఈ సినిమా బడ్జెట్ విషయంలో చాలా పరిమితులు పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన నుంచి మరో సినిమా ప్రకటన కూడా వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను మేకర్స్‌ రిలీజ్ చేశారు. పంచభూతాలను ఏకం చేసే ఓ కాలచక్రాన్ని చూపిస్తూ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఆ యూనివర్స్‌ వెనకాల మెగా మాస్‌ ఉందంటూ వెల్లడించారు. యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

Also Read:మెగా157 అనౌన్స్ మెంట్

మొత్తమ్మీద బింబిసార దర్శకుడు శ్రీ వశిష్ఠకి చిరంజీవి ఛాన్స్ ఇచ్చారు. ఫాంటసీ మూవీగా ఈ మూవీ రాబోతుంది. బింబిసార సినిమా కూడా ఫాంటసీ మూవీనే. మెగాస్టార్ నుంచి ఫాంటసీ మూవీ అంటే.. ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఇక కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మెగాస్టార్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కంటెంట్ పరంగా ఈ రెండు సినిమాలు విభిన్నమైన ప్రయోగంతో కూడుకున్నవి కావడం విశేషం.

Also Read:మెగాస్టార్‌కి శుభాకాంక్షల వెల్లువ

- Advertisement -