బఠానీల గురించి మనందరికి తెలిసే ఉంటుంది. ఇందులో పచ్చి బఠానీలు ఎండు బఠానీలు అని రెండు రకాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిని వంటింట్లో వివిధ రకాల ఆహార పదార్థాలతో పాటు ఉపయోగిస్తుంటారు. ఇంకా కొందరు పచ్చి లేదా ఎండు బఠానీలను స్నాక్స్ రూపంలో కూడా తింటూ ఉంటారు. పచ్చి బఠానీలు తినడం వల్ల కొన్ని రకాల ప్రయోజనలు కలుగుతాయి. పచ్చి బఠానీల లో ఫ్లెవనాయిడ్లు, కెరోటినాయిడ్స్, ఫలిఫినోల్స్ వంటివి ఎక్కువగా ఉంటాయి.
ఇంకా విటమిన్ ఏ, సి, డి, బి12 వంటి వాటితో పాటు ప్రోటీన్లు కూడా అధికంగానే ఉంటాయి. పచ్చి బఠానీలులో ఉండే పీచు పదార్థం అంతా త్వరగా జీర్ణం కాదు. అందువల్ల కొద్దిగా తిన్నప్పటికి కడుపు నిండిన భావనా కలుగుతుంది. తద్వారా వేగంగా బరువు తగ్గే అవకాశం ఉంది. ఇంకా ఇందులో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ వంటివి పిల్లల్లో ఎముకల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగ పడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అల్జీమర్, ఆర్థరైటిస్ వంటి సమస్యలను దూరం చేస్తాయి. ఇంకా పచ్చి బఠానీలలో ఉండే ఫ్లెవనాయిడ్లు క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయట. అయితే వీటి వల్ల ఆరోగ్య ప్రయోజనలు ఏ స్థాయిలో ఉన్నాయో దుష్ప్రభావాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
పచ్చి బఠానీలను ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరంగా మారుతుంది. తద్వారా తెంపులు, గ్యాస్ వంటి సమస్యలు పెరుగుతాయి. ఇంకా తిన్న ఆహారం అజీర్తిగా మారి వాంతులకు దారి తీస్తుంది. ఇమ్కా పచ్చి బఠానీలలో అధిక ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. తద్వారా వీటిని పరిమితికి మించి తింటే మూత్ర పిండాల పనితీరు మందగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఇవి అధికంగా తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ శాతాన్ని పెంచి కీళ్ల నొప్పులకు దారి తీస్తాయి. కాబట్టి బఠానీలను మితంగా తీసుకుంటే చక్కని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలా కాకుండా అమితంగా తింటే అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read:TG Cabinet:ఆ నలుగురు ఎవరు?