సరదాగా అలా బయటకు వెళ్లినప్పుడు రోడ్లపై వేసే బజ్జీలు, వడలు, వంటి చిరుతిండ్లను చూస్తే వెంటనే నోరూరుతుంది. దాంతో క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే వాటిని అరగిస్తుంటాము. అయితే కొన్ని సార్లు వాటిని తిన్నా తరువాత కడుపు సంబందిత సమస్యలతో తమతమతమౌతుంటాము. కడుపు ఉబ్బరంగా అమరడం లేదా గ్యాస్ ట్రబుల్ ఏర్పడడం, అజీర్తి వంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. ఇంకా మసాలా దినుసులు ఎక్కువగా వేసిన పదార్థాలను తినడం వల్ల కూడా ఈ రకమైన సమస్యలు ఏర్పడతాయి. అయితే అలాంటి సమయాల్లో ఏదైనా మెడిసన్ తీసుకోవడం లేదా టాబ్లెట్ వేసుకోవడం వంటివి చేస్తుంటాము. .
అయితే ఎలాంటి మెడిసన్ లేదా టాబ్లెట్ వేసుకోకుండానే సహజ సిద్దంగా వంటింటి చిట్కాల ద్వారా కడుపు సంబంధిత సమస్యలను తగ్గించవచ్చని అయోర్వేద నిపుణులు చెబుతున్నారు. జీలకర్రను నీటిలో వేసి మరిగించి ఆ రసాన్ని సేవిస్తే కడుపు ఉబ్బరం తగ్గుతుందట. ఇంకా మారేడు ఆకుల రసం రెండు స్పూన్లు తీసుకొని, అందులో నాలుగు మిరియాల చూర్ణం కలిపి మూడు పూటల తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు దురమౌతాయట. ఇంకా పసుపు కూడా ఉదర సమస్యలకు చక్కటి పరిష్కారంలా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పసుపు కొమ్మును ఒక కప్పు పాలలో వేసి దానిని బాగా మరిగించి ఆ తరువాత చల్లార్చి వడగట్టి తాగితే అల్సర్, ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయట. ఇంకా ఒక గ్లాస్ పాలలో కొంచెం నేల ఉసిరి ఆకులు వేసి బాగా మరిగించి చల్లారిన తరువాత ఆ మిశ్రమని తగిన కడుపు సంబంధిత సమస్యలు దూరమౌతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Also Read:డార్లింగ్ సరసన అందాల ‘నిధి’!