పరాయిపాలనలో మగ్గుతున్న భారతమాతకు విముక్తి కల్పించడానికి ఎందరో వీరులు పోరాటయోధులుగా మారారు. ప్రాణాలకు తెగించి స్వాతంత్ర్యాన్ని సాధించిపెట్టారు. అలాంటి వారిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ది ప్రత్యేక స్థానమనే విషయం అందరికీ తెలిసిందే. ధైర్యానికి, సాహసానికి ప్రతీక నేతాజీ.ఆయన పేరు వింటేనే గుండె ఉప్పొంగుతుంది.
జై జవాన్ అంటూ స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న కటక్ లో జన్మించారు. బ్రిటిష్ వాళ్ళిచ్చిన ఉన్నత పదవిని తిరస్కరించి, లండన్ నుండి స్వదేశానికి వచ్చి, తన రాజకీయ గురువైన చిత్తరంజన్ దాస్ నాయకత్వంలో స్వాతంత్య్రోద్యమంలో చేరారు. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు సుభాష్ చంద్రబోస్.
1938, 1939 లలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా బోస్ ఎన్నికయ్యారు. 1942 జనవరి 26న ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో భారత దేశ తొలి స్వతంత్ర జాతీయ సైన్యాన్ని రూపొందించారు. ఆజాద్ హింద్ రేడియో కేంద్రాన్ని బెర్లిన్ లో ప్రారంభించిన నేతాజీ.. జపాన్ మొదలైన దేశాల్లో కూడా ఆయా రాజ్యనేతలను, ప్రధాన మంత్రులను ప్రభావితం చేయగలిగారు.
Also Read:రాక్షస కావ్యం…టీజర్ లాంఛ్
1945 ఆగస్టు 22న టోక్యో రేడియో నుంచి ఒక వార్త వెలువడింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆగస్టు 18న విమాన ప్రమాదంలో మరణించారు అని. ఆ వార్తని నేతాజీ అభిమానులు ఎవరూ నమ్మలేదు. నేటికీ నేతాజీ అదృశ్యం ఒక మిస్టరీగానే మిగిలింది. అయితే రీసెంట్‌గా నేతాజీ మరణంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. చంద్రబోస్ 1945 ఆగష్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో మృతిచెందాడని తెలిపింది.
Also Read:బిఆర్‌ఎస్ లోకి జగ్గారెడ్డి.. ఖాయమా?