MP Santhosh:ఫొటోగ్రఫీ ఓ ఎమోషన్‌

59
- Advertisement -

తెలంగాణ ఫొటో జర్నలిస్టుల సంఘం, తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను రాజ్యసభ ఎంపీ, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ఈరోజు రవీంద్రభారతిలో ప్రారంభించారు.

సంతోష్ కుమార్ ఈ ప్రదర్శనను ప్రారంభించడం ఇది నాల్గవసారి. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఈ ఫోటోగ్రఫీని ఏర్పాటు చేశారు.ఒక ఫోటోను వెయ్యి పదాలతో సమానంగా చూసేవారని, ఇప్పుడు ఒక ఫోటో భావోద్వేగంతో ముడిపడిందన్నారు. ఫోటో జర్నలిస్టులు విభిన్న అంశాలను స్పష్టంగా, అద్భుతంగా తీసినందుకు అభినందించారు. ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసిన భాస్కర్‌, అల్లం నారాయణలను సంతోష్‌కుమార్‌ అభినందించారు. ఫొటోగ్రఫీ ఓ ఎమోషన్‌ అని …ఫోటోగ్రాఫర్ల సంక్షేమం కోసం నిధి కోసం స్పాన్సర్‌లను తీసుకుంటామని ఫోటోగ్రాఫర్‌లకు హామీ ఇచ్చారు.

Also Read:మోడీ గెలవాలంటే.. మార్గమదే?

- Advertisement -