జైలర్ చిత్రం హిట్ అవుతుదని ఊహించలేదని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. ఆయన బద్రీనాధ్ ఆలయాన్ని సందర్శించి, తరువాత రిషికేష్ లోని స్వామి దయానంద ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ మాట్లాడుతూ.. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తీసిన బీస్ట్ సినిమా పరాజయం పొందడంతో అయన డైరెక్షన్ లో నటించవద్దని చాలామంది చెప్పారన్నారు. అయితే, నెల్సన్ కథను నమ్మి ఆ సినిమాలో నటించానని చెప్పారు. జైలర్ 3 రోజుల్లోనే రూ.200 కోట్లు రాబట్టింది.
అన్నట్టు రిషికేశ్‌లోని స్వామి దయానంద గురూజీ ఆశ్రమాన్ని సందర్శించిన అనంతరం రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నో అంచనాల మధ్య తాను నటించిన జైలర్ విడుదలైందని అన్నారు. కంగారుపడొద్దు.. సినిమా తప్పకుండా విజయం అందుకుంటుంది అని స్వామీజీ చెప్పారని రజనీకాంత్ పేర్కొన్నారు. స్వయంగా స్వామిజీనే ఆ మాట చెప్పారంటే జైలర్ హిట్ అయినట్లే కదా అని రజని అన్నారు. గురువారం విడుదలైన జైలర్ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోంది.
Also Read:స్వాతంత్య్రోద్యమం..కీలక ఘట్టాలు
పైగా జైలర్ కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఈ సినిమాకు రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.152.02 కోట్లు వచ్చినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా బడ్జెట్ కూడా అంత లేదు. కాబట్టి.. జైలర్ మూడో రోజు నుంచి కలెక్ట్ చేస్తున్న కలెక్షన్స్ అన్నీ లాభాలు కిందకే వస్తాయి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో తమన్నా హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో హీరోలు మోహన్ లాల్, శివరాజ్ కుమార్, సునీల్, రమ్యకృష్ణ కూడా నటించారు.
Also Read:తెలంగాణలో చంద్రబాబు రిస్క్ చేస్తున్నాడా?