ఆర్టీసీ ప్రజలకు మెరుగైన సేవలను అందించాలన్నదే ప్రభుత్వం అభిమతమని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వం నుంచి అన్నివిధాలా ఆర్టీసీ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రగతి భవన్‌లో ప్రజల ముంగిట బస్సులు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వజ్ర బస్సుల బ్రోచర్‌తో పాటు యాప్‌ను లాంఛ్ చేశారు.
తెలంగాణ రాకముందు ఆర్టీసీ ఉంటదో ఉండదోనన్న ప్రచారం జరిగిందని కానీ ఆర్టీసీకి ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పారు. గతంలో తాను ఆర్టీసీ మంత్రిగా ఉన్నప్పుడు సంస్థను లాభాల బాటలోకి తెచ్చానని తెలిపారు. అర్బన్ ట్రాన్స్ పోర్టు ఎప్పుడు లాభాల్లో ఉండాలని సూచించారు. ప్రజలకు రవాణా సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని తెలిపారు. రూ.350 కోట్లతో కొత్త బస్సులను కొనుగోలు చేశామని తెలిపారు.
నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. కార్మికులకు ఫిట్ మెంట్ పెంచినట్లు తెలిపారు. గతంలో ఎవరు ఆర్టీసీని గట్టెక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించలేదని తెలిపారు. అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తే సంస్థను కాపాడుకోవచ్చని సీఎం చెప్పారు. ప్రతిరోజు 90 లక్షల మందిని ఒకచోట నుంచి మరోకచోటికి ఆర్టీసీ నేరవేరుస్తుందని చెప్పారు. ఆర్టీసీ అంటే ప్రజలకు నమ్మకం ఉందని ఆ నమ్మకాన్ని వమ్ము చేయవద్దన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తికనబరుస్తున్నాయని చెప్పారు. తెలంగాణ ఆర్టీసీ కూడా దేశానికే ఆదర్శం కావాలన్నారు. హైదరాబాద్ -వరంగల్,హైదరాబాద్- నిజామాబాద్ మధ్యలో వజ్ర ఏసీ బస్సులు నడపబోతున్నామని తెలిపారు. త్వరలో కరీంనగర్‌కు కూడా బస్సు సర్వీసులను ప్రారంభిస్తామని చెప్పారు.