అసలు తానేంటో మోడీకి తెలుసా?

22
- Advertisement -

ప్రధాని నరేంద్రమోడీ పై రోజురోజుకూ విమర్శలు పెరిగిపోతున్నాయి. ప్రత్యర్థి పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు బీజేపీ నేతలు కూడా డిఫెన్స్ లో పడిపోతున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో తాజా పరిణామాలను గమనిస్తే ఈ విషయం స్పష్టమౌతోంది. మణిపూర్ అల్లర్ల విషయంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడంలో సక్సస్ అయిన విపక్షాలు.. చర్చలో మోడీ సర్కార్ ను ఇరకాటంలో పెట్టడంలో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. కానీ విపక్షల విమర్శలకు బీజేపీ ఎంపీలు మాత్రం తెల్లమొఖం వేయాల్సిన పరిస్థితి. ముఖ్యమా మణిపూర్ అల్లర్ల విషయంలో అసలు సమాధానమే చెప్పకుండా చర్చను తప్పుదోవ పట్టిస్తున్న పరిణామాలు చూస్తున్నాం..

ఇక నిన్న జరిగిన సభలో ప్రధాని మోడీ అయిన మణిపూర్ విషయంలో ఘాటుగా స్పందిస్తారనుకుంటే.. సొ సొ గా తనదైన రీతిలో ప్రసంగం చివర్లో నాలుగు వాక్యల్లో మణిపూర్ ప్రస్తావన ముగించారు. ఈ నేపథ్యంలో మోడీ వైఖరి పై మరోసారి భగ్గుమంటున్నారు ప్రత్యర్థి నేతలు.. అసలు మోడీకి తాన పదవి ఏంటో అర్థమౌతోందా అంటూ ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా జరిగిన మీడియా సమావేశంలో ఇదే విషయాలను ప్రస్తావించారు. ప్రధాని అంటే దేశ ప్రజలను ప్రతిబింబిస్తూ మాట్లాడాలని, చిల్లర రాజకీయలు పక్కన పెట్టాలని సూచించారు రాహుల్ గాంధీ.

Also Read:బండిపై వేటు వేస్తారా?:మంత్రి కేటీఆర్ ప్రశ్న

మణిపూర్ హింస ను భారత ఆర్మీ రెండు రోజుల్లో అదుపు చేయగలదని, కానీ అక్కడ హింస జరగాలని మోడీ కోరుకుంటున్నట్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. మణిపూర్ లో ఈ స్థాయి అల్లార్లు జరుగుతున్నా మోడీ అక్కడ ఎందుకు పర్యటించడం లేదని ప్రశ్నించారు.మణిపూర్ అంశాన్ని మోడీ తమాషా చేశారని.. లోక్ సభలో రెండు గంటలు ప్రసంగించిన మోడీ రెండు నిముషాలు మాత్రమే మణిపూర్ అంశాన్ని ప్రస్తావించారని, ఆ సమయంలో కూడా జోకులు వేయడం నవ్వడం వంటివి చేశారని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతున్నాయి.

- Advertisement -