కేంద్రంలో కే‌సి‌ఆర్ టార్గెట్.. ఫిక్స్?

68
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత దేశ ప్రజల దృష్టిని గట్టిగానే ఆకర్షించారు. ఎందుకంటే తెలంగాణలో జరిగిన అభివృద్ది ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండడంతో దేశాభివృద్ది కే‌సి‌ఆర్ తోనే సాధ్యమని బి‌ఆర్‌ఎస్ కు దేశ ప్రజలు ఘన స్వాగతాన్ని పలికారు. ఇప్పటికే మహారాష్ట్రలో బి‌ఆర్‌ఎస్ కు లభిస్తున్న ఆధారణ అక్కడి స్థానిక పార్టీలను సైతం కలవర పెడుతోంది. ఇక ఇదే రీతిలో బిహార్, కర్నాటక, మద్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో కూడా బి‌ఆర్‌ఎస్ కు సానుకూలత కనిపిస్తోంది. దీంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ ప్రభావం ఎలా ఉండబోతుందనే చర్చ ఆసక్తికరంగా సాగుతోంది.

ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీయే కూటమి మరియు ఇండియా కూటమి ప్రధానంగా పోటీలో నిలుస్తున్నాయి. అయితే ఈ రెండు కూటములకు ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని నాశనం చేశాయని, అలాంటి పార్టీలు ప్రాతినిథ్యం వహిస్తున్న కూటములతో చేతులు కలిపే ప్రసక్తే లేదని గతంలోనే తేల్చి చెప్పారు కే‌సి‌ఆర్. దీంతో 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ ఒంటరిగా బరిలోకి దిగబోతుందనే విషయం స్పష్టమైంది.

Also Read:కూరగాయలను పచ్చిగా తింటే ప్రమాదమా?

అయితే రెండు బలమైన కూటములను తట్టుకొని బి‌ఆర్‌ఎస్ సత్తా చాటుటుందా ? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చాలమంది. అయితే ఇందులో నో డౌట్ అంటున్నారు ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్, మహారాష్ట్రలోని 48 లోక్ సభ సీట్లు, అలాగే తెలంగాణలోని 17 సీట్లలలో సత్తా చాటితే కేంద్రంలో కీలక పాత్ర పోషించవచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారాయన. ఎందుకంటే ఎన్డీయే కూటమి మరియు ఇండియా కూటమి మద్య గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో ఈ రెండు కూటములు స్పష్టమైన సీట్లు సాధించకపోతే.. బి‌ఆర్‌ఎస్ అవసరత కచ్చితంగా ఉంటుంది. అలాంటి సమయంలో కే‌సి‌ఆర్ కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే కే‌సి‌ఆర్ ప్రస్తుతం కచ్చితంగా గెలిచే స్థానాలపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

Also Read:అసలు గుండెపోటు ఎందుకొస్తుందో తెలుసా?

- Advertisement -