రొమాంటిక్ మూడ్‌లో కట్టప్ప..!!

267
sathyaraj-ramya-krishnanin-pothys-ad
sathyaraj-ramya-krishnanin-pothys-ad
- Advertisement -

మిర్చి తో టాలివుడ్ తేర పై కనిపించి ఆ తర్వాత పూజ, తుంగభద్ర,రాజా రాణి తర్వాత “బాహుబలి” చిత్రంలో హీరోగా నటించిన ప్రభాస్ కి ఎంతపేరు తీసుకోచ్చిందో అందుకు ఏ మాత్రం తగ్గకుండా ‘కట్టప్ప’ పాత్రలో నటించిన సత్యరాజ్ కి కూడా ఆ చిత్రం అంతే క్రేజ్ ని తెచ్చిపెట్టింది. అందులో సందేహం లేదు.. బాహుబలిలో ప్రభాస్ తరువాత ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకున్న పేరు కట్టప్ప. ఈపేరుతో పాటు ఓ ప్రశ్నకూడా జనం నోళ్లలో నానుతూ వచ్చింది అదే కట్టప్పా వై కిల్డ్ బాహుబలి. భల్లాలదేవ కుట్ర తెలియక రాజమాత శివగామిదేవి ఆదేశాల మేరకు కట్టప్ప బాహుబలిని చంపేస్తాడు. మహిశ్మతి సింహాసనానికి కట్టు బానిసైన కట్టప్ప… శివగామి ఏ పని ఆదేశించినా ‘చిత్తం తల్లీ’ అంటూ శిరసవహిస్తాడు. ఇలా కట్టప్ప క్యారెక్టర్‌ ఎంత క్రేజ్‌ను సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అసలు విషయానికి వస్తే.. సత్యరాజ్ గత రెండేళ్లుగా పోతీస్ టెక్స్‌టైల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. బాహుబలి సినిమాతో కట్టప్ప, శివగామి క్యారెక్టర్‌లు ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులారిటీ రావడంతో ఈ క్యారక్టర్స్‌‌నే భార్య భర్తలుగా చూపిస్తూ బాహుబలి స్టైల్‌ కాస్ట్యూమ్స్‌తో ఓ యాడ్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సత్యరాజ్ రమ్యకృష్ణకు పోతీస్ వారి చీరను కొని పెడుతూ భుజంపై చేయి వేసి మంచి రొమాంటిక్ మూడ్‌లో ఉన్నాడు. యాడ్ హాట్ టాపిక్‌గా మారడంతో ఈ అడ్వర్టైజ్‌మెంట్‌కు ఫుల్ పబ్లిసిటీ వచ్చేసింది. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. కట్టప్ప ఇందుకోసమే బాహుబలిని చంపాడా అని ఒకరు కామెంట్ చేయగా.. కట్టప్ప శివగామిని ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడని మరోకరు ఇలా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఈ యాడ్‌లో ఏముందో  మీరే చూడండి…

- Advertisement -