సుప్రీంలో రాహుల్‌కి ఊరట..

38
- Advertisement -

ఎట్టకేలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. మోదీ ఇంటి పేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువునష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించేందుకు నిరాకరించింది గుజరాత్ హైకోర్టు.

దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు రాహుల్ గాంధీ. సర్వోన్నత న్యాయస్థానంలో రాహుల్‌కి రిలీఫ్ లభించింది.

2019లో జరిగిన ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ ఇంటిపేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు గాను ఇటీవల సురత్ కోర్టు రెండెళ్లు జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు అవకాశం కూడా ఇచ్చింది. ఈ మేరకు శిక్షను 30 రోజుల పాటు నిలుపుదల చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8(1) ప్రకారం.. పార్లమెంట్‌ సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి, కనీసం రెండేండ్లు జైలు శిక్ష పడితే వారు ఆ పదవికి అనర్హులవుతారు. దీంతో రాహుల్ గాంధీ 2 ఏళ్ల పాటు ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశాన్ని కోల్పోయారు.

Also Read:రోజు నిమ్మరసం తాగుతున్నారా?

- Advertisement -